దీపావళి అంటే చీకట్లు పార ద్రోలి వెలుగులు నింపాలి కానీ ఎన్నో కుటుంబాల్లో చీకట్లు నింపిన దీపావళి అందుకే మన అందరి కోసం కోసం కొన్ని జ్రాగర్తలు*
ప్రతి ఇంట దీపాలు వెలిగించి కోటికాంతులతో వాతావరణం లో వేడి గాలి సృష్టించి తేమలో బ్రతికే వైరస్ లను చంపి విషజ్వరాలను అరికట్టేవారు అందుకే దీపాల సమూహం దీపావళి ప్రతి ఇంటా దీపాలు వెలిచండి
దీపావళి అంటే రంగుల రంగుల కేళి ఆనంద హొలీ ఇది ఒకప్పుడు ఇప్పుడు పరిస్థులు మారాయి.
✍పూర్వం శీతాకాలం లో ఎక్కువ దోమలు ఇతర వైరస్ లు వాతావరణం లో ప్రాల ద్రోలడానికి జరుపుకునే వారు కానీ అందుకు తగ్గట్టు గా తిప్పుడు పొట్లాలు,సిసింద్రీ లు మతాబి ,చిచ్చు బుడ్డులు కాల్చే వారు ఇవి అన్ని సొంత గా తయారు చేసుకునే వారు.
కానీ ఇప్పుడు మన సంసృతి కి భిన్నంగా పర్యవరణం నాశనం అయ్యేలా జరుపుకుంటున్నాము.
*దీపావళి కి మనం పాటిచాల్సిన జగర్తలు.*
చెప్పులు వేసుకునే మందులు అంటించాలి ముక్కుకు గుడ్డ కట్టుకోవాలి కళ్ళకు కళ్ళజోడు ధరిస్తే చేలా మంచిది ఎందుకు అంటే మందుల్లో వాడే పాస్పరస్, సల్పర్ వలన కంటి చూపు కోల్పోయే ప్రమాదం ఉంది.వాసన పీల్చడం వలన అస్మా వచ్చే అవకాశం ఎక్కువ
లూజ్ గా ఉండే కాటన్ దుస్తులు మాత్రమే ధరించాలి.
ప్రమాద కర మందులు వెలిగించే ముందు పక్కన కొంచెం బకెట్ తోవాటర్ పెట్టుకోవాలి
తాటాకు ఇల్లు పశుశాలలు ముందే తడుపుకుని ఉంచుకోవాలి* పెంపుడు జంతువులు, పక్షులు, వీధి జంతువులు శబ్దాలకి చెవుడు వచ్చి ఆహారం తీసుకోలేవు మనం ఆనందం కోసం వాటిని హింసించడం పాపం అందుకే వాటికి దూరంగా కాల్చాలి.
అస్మా ఉన్నవారు మందులు కాల్చడం పొగ పీల్చడం చేయకూడదు ముక్కుకి గుడ్డ కట్టుకోవాలి.
చిన్న పిల్లలుకు పెద్ద బాంబులు ఇవ్వకూడదు.వారు ఎక్కడ ఉన్నారో ఒక కంట కనిపెట్టాలి.
పేలని వాటిని మల్లి ఉది చూడకూడదు.వాటిని వదిలి వేయాలి
వీధి జంతువులు పైన బాంబులు వేయకూడదు రోడ్ పైన వేసే ముందు మనుషుల్ని గమనించి వేయాలి.
పెద్ద పెద్ద శబ్దాలు చేసే వాటిని పీల్చడం వలన కర్ణభేరి పగిలి శాశ్వత చెవిటి వారు అవ్వొచ్చు అందుకే నీళ్లు నూనె పోయకుండా డాక్టర్ ని సంప్రదించాలి. పెద్ద శబ్దం వచ్చే వాటిని ఊరికి దూరంగా జనసంచారం లేని ప్రాంతాల్లో కాల్చాలి కాల్చే ముందు చెవులలో దూది పెట్టుకోవాలి.
దీపావళి అయ్యాక పేలని మందులు తెచ్చి పిల్లలు మళ్ళీ వెలిగిస్తారు వాటిని కనిపెట్టాలి.
మందుల్లో ఉండే భాస్వరం, సూరే కారం,పాస్పరస్,సల్పర్ వలన వాతావరణం లో గాలి కాలుష్యం అయ్యి 15 రోజులు పైనే పేల్చే గాలి పైనే ప్రభావం చూపుతుంది దీని వలన గుండె ఊపిరితిత్హులు,అస్మా లాంటి దీర్ఘకాలిక ప్రమాద కర వ్యాధులు వస్తాయి పకృతి జీవ రాశులు కూడా అంత రిస్తాయి అందుకే వీలైనంత తక్కువ మందులు కాల్చడం మంచిది.
మనం ప్రకృతికి చేసే హాని జీవ రాశులు దెబ్బ తినకుండా ప్రతి దీపావళి నాడు అనువైన ప్రదేశాల్లో ఒక మొక్క నాటాలి.
కంటిలో నిప్పు మందు నిప్పు రవ్వ లు పడితే కంటిని నలప కుండా ఆసుపత్రికి వెళ్ళాలి.
దయ చేసి పేలే సామగ్రి రైళ్లు బస్సులలో తీసుకు వెళ్లొద్దు అవి పేలితే కొన్ని వందలు చని పోతారు
ఎలాంటి ప్రమాదాలు జరగ కుండా తల్లి తండ్రులు పిల్లల పట్ల జాగర్త వహించి ప్రతి దీపావళికి ప్రమాదాలు ఎక్కువ అయ్యాయి ఎన్నో జీవితాలు వికలాంగులు అయ్యారు కంటి చూపు కోల్పోయారు జీవితం బాగుంటే ఎన్ని దీపావళి లు అయ్యినా జరుపుకోవొచ్చు చిన్న పాటి దుర్భిక్షంమైన ఆనందం కోసం జీవితం నాశనం చేసుకోవొద్దు .
ఆగ్ని మాపక సిబ్బంది అందరూ అందుబాటులో ఉండేలా ప్రభుత్వాలు చొరవ తీసుకోవాలి నీటితో వాహనాలు నింపాలి.