ఈనెల 21, 22 తేదీల్లో శ్రీకాకుళం జిల్లా టీడీపీ సమీక్షలు

ఈనెల 21, 22 తేదీల్లో శ్రీకాకుళం జిల్లా టీడీపీ సమీక్ష సమావేశాలు జరుగుతాయని రాష్ట్ర అధ్యక్షుడు కళా వెంకటరావు తెలిపారు.  రాష్ట్రంలో పార్టీ పరిస్థితిపై సమీక్షలు కొనసాగిస్తున్న టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఈనెల 21, 22 తేదీల్లో శ్రీకాకుళం జిల్లాలో పర్యటించనున్నారని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కళా వెంకటరావు తెలిపారు. ఈరోజు ఉదయం ఆయన మీడియాతో మాట్లాడుతూ రెండు రోజులపాటు జిల్లా కేంద్రంలో బస చేయనున్న చంద్రబాబు జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో పరిస్థితిపై ఆరా తీస్తారని తెలిపారు. ఒక్కో నియోజక వర్గంలోని నాయకులు, కార్యకర్తలతో సమీక్ష నిర్వహించి గత ఎన్నికల్లో ఓటమిపై విశ్లేషించనున్నారని వివరించారు.
 విపక్ష నేతలను వేధించడమే లక్ష్యంగా అధికార పార్టీ తీరు ఉందని  కళా వెంకటరావు అధికార పార్టీ తీరుపై ధ్వజమెత్తారు. ఇసుక కొరతతో నిర్మాణ రంగ కార్మికులు రోడ్డున పడ్డారని, బోటు ప్రమాదంపై జ్యుడీషియల్‌ విచారణ జరిపించాలని డిమాండ్‌ చేశారు.