మోటారు వాహన చట్టాన్ని అతిక్రమించి చేసే నేరాలు.

వాహనాలను అధిక వేగంతో నడపడం, బాధ్యతారాహిత్యమైన డ్రైవింగ్‌ వంటివి మోటారు వాహన చట్టాన్ని అతిక్రమించి చేసే నేరాలు. అయితే మోటారు వాహన చట్టాన్ని అతిక్రమించిన వారు భారతీయ శిక్షా స్మృతి (ఐపీసీ)ని కూడా అతిక్రమించినట్లేనని సుప్రీంకోర్టు స్పష్టంచేసింది. ఈ రెండూ వాటి పరిధుల్లో చక్కగానే పనిచేస్తున్నాయని, ప్రమాదాల సమయంలో చట్టరీత్యా ఎదుర్కోవాల్సిన విచారణలో కూడా రెండూ సరిగ్గానే ఉన్నాయని అ. మోవా చట్టానికి చెందిన కేసులను ఐపీసీ కింద పరిగణించలేమంటూ 2008 డిసెంబరు 22న గౌహతి హైకోర్టు ఇచ్చిన తీర్పును విచారిస్తూ సుప్రీంకోర్టు ఆదివారం ఈ వ్యాఖ్యలు చేసింది. జస్టిస్‌ ఇందు మల్హోత్రా, జస్టిస్‌ సంజీవ్‌ ఖన్నాల ధర్మాసనం ఈ కేసును విచారించింది.