పీఎంసీ బ్యాంకులో జరిగిన రూ.4,355 కోట్ల కుంభకోణంతో సంబంధం ఉందన్న

పంజాబ్‌ అండ్‌ మహారాష్ట్ర కోఆపరేటివ్‌ (పీఎంసీ) బ్యాంకు మాజీ ఎండీ జోయ్‌ థామస్‌కు ముంబయి అదనపు ప్రధాన మెట్రోపాలిటన్‌ న్యాయమూర్తి అక్టోబర్‌ 17 వరకు కస్టడీ విధించారు. కాగా ఎలాంటి నిర్ణయాధికారం లేని థామస్‌ను ఈ కేసులో బలిపశువుగా మారుస్తున్నారని అతడి తరఫు న్యాయవాది రాకేశ్‌ సింగ్‌ వాదించారు. అతడు కేవలం బ్యాంకులో ఉద్యోగి మాత్రమేనన్నారు. పీఎంసీ బ్యాంకులో జరిగిన రూ.4,355 కోట్ల కుంభకోణంతో సంబంధం ఉందన్న ఆరోపణలతో ముంబయి పోలీసు ఆర్థిక నేరాల శాఖ (ఈఓడబ్ల్యూ) థామస్‌ను శుక్రవారం అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. శనివారం ఆయనను న్యాయస్థానంలో ప్రవేశపెట్టారు.


Popular posts
రాష్ట్ర తొలి మహిళా సీజేజస్టిస్‌ హిమ ప్రమాణం
Image
తెలుగు జనతాపార్టీ సేన నియామకం
Image
కోనేరు కృష్ణపై సీఎం కేసీఆర్ సీరియస్
*లాక్ డౌన్ నిబంధనలకు విరుద్ధంగా శ్రీ బాలాజీ వైన్స్ లో మద్యం వ్యాపారం* *మేడ్చల్ జిల్లా జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని శ్రీ బాలాజీ వైన్స్ లో లాక్ డాన్ నిబంధనలను తుంగలో తొక్కిన యాజమాన్యం.* *భౌతిక దూరం పాటించకుండా విచ్చలవిడిగా చేస్తున్న మద్యం వ్యాపారం.* *కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కరోనా మహమ్మారిని కట్టడి చేయడానికి భౌతిక దూరం తప్పనిసరని నెత్తి నోరు మొత్తుకుని చెప్తున్నా సదరు వైన్స్ యజమానులు లాక్‌డౌన్‌ నిబంధనలకు తూట్లు పొడుస్తున్నారు. దీనిపై పోలీసు మరియు ఎక్సైజ్ శాఖ ఉన్నతాధికారులు తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుకుమతున్నారు.
Image
సాములోరూ...  సంబరాలు ఏమిటో..?