అన్నదాతల అభివృద్ధి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ లక్ష్యం

 


అన్నదాతల అభివృద్ధి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ లక్ష్యం


మైలవరం ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణప్రసాద్.                 అన్నదాతల అభివృద్ధి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి ఏకైక లక్ష్యమని కృష్ణాజిల్లా మైలవరం నియోజకవర్గ ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణప్రసాద్ పేర్కొన్నారు. మంగళవారం మైలవరం పట్టణంలో వైఎస్ఆర్ రైతు భరోసా ప్రధానమంత్రి కిసాన్ పథకాన్ని ఎమ్మెల్యే వసంత ప్రారంభించారు. ఈ సందర్భంగా మైలవరం లోని వ్యవసాయ మార్కెట్ యార్డ్ నందు ఏర్పాటుచేసిన ఈ కార్యక్రమంలో వసంత రైతులను ఉద్దేశించి మాట్లాడారు. రాష్ట్రవ్యాప్తంగా రైతు భరోసా పథకం కింద రూ.8 750 కోట్ల రూపాయలు నిధులను రైతులకు నేరుగా వారి బ్యాంక్ ఖాతాలలో జమచేయడానికి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆదేశాలను జారీ చేశారన్నారు. దేశ చరిత్రలోనే ఎన్నడూ లేని విధంగా ఒక రైతుకు ఈ పథకం కింద రూ. 13500 జమ చేయడం జరిగింది.ఆలాగే మైలవరం నియోజకవర్గ0 లోని  27589 మంది రైతులకు ఈ పథకం కింద నుమారు రూ.41 .80కోట్లు,మంజూరైనా అన్నారు.మొదటి విడతగా రూ.21.55 కోట్లు మంజూరైన యన్నారు.అలాగే కౌలు రైతులు 1121 మందికి రూ.1.28 కోట్లు మంజూరైనాయన్నారు. రాష్ట్ర ప్రభుత్వం  ఏ కార్యక్రమం ప్రవేశపెట్టిన అది ప్రజల సంక్షేమం కోసం మె మన్నారు.ఈ పథకం  కౌలు రైతుల కు కూడా వర్తిస్తుందన్నారు.వారిని కూడా అభివృద్ధి చేయాలన్న లక్ష్యంతో వారికి రాష్ట్ర ప్రభుత్వం కొండంత అండగా ఉందన్నారు.  ఇటీవల ఆటో  డ్రైవర్లకు కూడా  రూ .10 వేల రూపాయలు వారికి జమ చేయడం  న్నారు. ప్రజలకు సేవ చేయాలన్న ఆలోచనతో  ప్రభుత్వం గ్రామ సచివాలయ వ్యవస్థను ప్రవేశపెట్టి0దన్నారు .వాలంటీర్ల ద్వారా ప్రజలకుమెరుగైన సౌకర్యాలు  అందుతున్నాయన్నారు.తాను రైతు కుటుంబం నుండి  వచ్చాననీ, రైతులు పడే కష్టాలు ,నష్టాలు, ఆర్థిక ఇబ్బందులు తనకు తెలుసునన్నారు .మునుపెన్నడూ లేని విధంగా మైలవరం నియోజకవర్గంలోని అన్ని సాగునీటి చెరువులకు సాగర్ జలాలతో ,నింపడంజరిగిందన్నరు. దేవుడు కూడా ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వానికి అండగా ఉన్నారన్నారు ,ఆయనకు ప్రభుత్వం ఋణపడిందన్నారు.అంతకుముందు ఎమ్మెల్యే వసంత ఎడ్లబండిపై స్థానిక వ్యవసాయ మార్కెట్ యార్డుకు  తరలి వచ్చారు. అనంతరం వ్యవసాయ శాఖ ఏర్పాటు చేసిన స్టాల్స్ పరిశీలించి చి సంతృప్తిని వ్యక్తం చేశారు.మైలవరం పట్టణంలో ఈ పథకం ప్రారంభం కావడంతో పండుగ వాతావరణం నెలకొంది. ఈ కార్యక్రమంలో జడ్పీ సిఇఓ సూర్యప్రకాశరావు,వ్యవసాయ శాఖ, ఉద్యాన శాఖ,పట్టు పరిశ్రమల శాఖ,అధికారులతోపాటు ఎంపీడీఓ,తహసీల్దార్లు నియోజకవర్గ పార్టీ నాయకులు పాల్గొన్నారు*.