దేశానికి సైనికులు ఎంత అవసరమో

దేశానికి సైనికులు ఎంత అవసరమో


 అంతర్గతంగా మనం సమాజం లో ప్రశాంతగా జీవనం సాగించాలి అంటే,  మన ధన,  మాన,  ప్రాణాలను కాపాడటానికి పోలీస్ లు అంతే అవసరం.  మనం అందరం పండుగ చేసుకుతువుంటే పోలీస్ వారు మనం సంతోషం గా ఆ పండుగ చేసుకోవడానికి వారు కుటుంబాలను వదిలి రోడ్డు పై వుంటారు. మనం రాత్రి ఇంటికెళ్లి పడుకుంటే మనకు రక్షణగా రాత్రి పూట వారు గస్తీ తిరుగుతారు. రోడ్డు పై ప్రమాదం జరిగితే అందరు చూస్తూ వెళితే పోలీస్ లు ఆ ప్రమాదం లో గాయపడ్డ వారిని ఆసుపత్రి కి చేర్చి ప్రాణాలు కాపాడుతారు,  అనాధ శవాలు కనబడ్డా,  పశువులు చనిపోయిన,  ఎదురింటి వాడు మన వాకిట్లో చెత్త వేసినా,  పక్కింటి వాడు మన ఇంటి ముందు నీళ్లు వదిలిన, మన పొలానికి పై వాడు నీళ్లు ఇవ్వక పోయిన, ధాన్యం డబ్బులు ఇవ్వకపోయినా, తల్లి తండ్రులను పిల్లలు చూడక పోయిన,   చివరికి భార్య తిట్టినా పోలీస్ లకు పిర్యాదు ఇచ్చే మనం వారి సేవలను గుర్తించి మన కోసం ప్రాణాలు వదిలిన పోలీస్ అమరవీరులకు శ్రద్ధాంజలి ఘటిస్తూ,  వారి కుటుంబాలను కాపాడు కోవలిసిన బాధ్యత మన అందరిమీద ఉందని తెలియజేస్తూ....  పోలీస్ అమరవీరులకు నా నివాళులు అర్పిస్తున్నా. మీ మేకతోటి సుచరిత,  రాష్ట్ర హోం శాఖమంత్రి.