గురువారం నుంచి అన్ని డిపోల్లో షెడ్యూల్ ప్రకారం బస్సులు నడవనున్నాయని మంత్రి పువ్వాడ అజయ్ తెలిపారు. ఆర్టీసీ అధికారులు, ఆర్డీవోలతో మంత్రి అజయ్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. అధిక ఛార్జీలు వసూలు చేస్తే చర్యలు తీసుకుంటామని చెప్పారు. ప్రతీ బస్సులో టికెట్ ధరల పట్టిక పెడతామన్నారు. టికెట్ ధర కంటే ఎక్కువ వసూలు చేస్తే ఫిర్యాదు చేయమని తెలిపారు. ప్రతి బస్సులో పాస్‌లు కచ్చితంగా అనుమతించాల్సిందేనని ఆదేశించారు. అన్ని డిపోల్లో డీఎస్పీ ఇన్‌చార్జ్‌గా కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేస్తామన్నారు.
షెడ్యూల్ ప్రకారం బస్సులు, పాస్‌లు కచ్చితంగా అనుమతించాల్సిందే