మా ఉద్యోగ భద్రతా విషయమై విన్నపం

 


 


 మా ఉద్యోగ భద్రతా విషయమై మీ ద్వారా గౌరవముఖ్యమంత్రివరులు వై ఎస్  జగన్ మోహన్ రెడ్డిగారికి మరియు  ప్రభుత్వనికి విన్నవ్విచు విషయం ఏమనగా, 


    మీడియా సోదరులారా గత ప్రభుత్వం 2016 లో మెడల్ సంస్థ కు  గవర్నమెంట్ హాస్పటల్స్ ( PHC, CHC, AH, GGH) లో  రక్త పరీక్షలు నిర్వహించడానికి ఒప్పందం కుదుర్చుకుంది,13 జిల్లాలలో  మెడల్ సంస్థ సబ్ కాంట్రాక్టర్ల ద్వారా మమ్మల్ని ప్లాబోటోమిస్ట్స్ మరియు ల్యాబ్ టెక్నీషియన్ లు గా నియమించడం జరిగింది. 2016 నుఁడి సంస్థ నిర్వహించు  పరీక్షలే కాకుండా హాస్పటల్స్ లో నిర్వహించు అన్నిరకాల పరీక్షలు (HIV, HbsAg,TB కి సంబందించిన కఫము పరీక్షలు, మూత్ర పరీక్షలు)మాచేత చేయించడం జరిగింది,  అందుకుగాను మాకూ ఒక నెలకి 3500-5000 ఇచ్చేవారు,అయినప్పటికీ ఎన్ని  ఇబ్బందులు ఎదురైనా, అనారోగ్య సమస్యలువచ్చిన  మేము విధులు నిర్వహిస్తూ వచ్చాము.కానీ ఇప్పుడు కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మెడల్ సంస్థ ను రద్దు చేయబోతోందని రాష్ట్రం లోని కొన్ని ప్రంచెజ్స్ గత 4నెలలుగా మాకు జీతాలు ఆపేసారు కొన్ని ల్యాబ్స్ ను మూసివేశారు, ఇలాచేయడం ద్వారా మాకూ ఉద్యోగ భద్రత లేని కారణంగా రాష్ట్ర వ్యాప్తంగా సుమారుగా 5000మంది జీవితాలు ప్రస్నార్ధకరంగా మారాయి.గత ప్రభుత్వం లో  లాభం పొందిన కొన్ని ప్రంచెజ్స్ ప్రభుత్వం పైన ప్రజల్లో వెతిరేక భావన తీసుకురావాలని ప్రభుత్వం ఎలాంటి ఉత్తర్వులు ఇవ్వకుండా ల్యాబ్ లను మూసివేసి,మా జీతాలు ఆపివేసి ఉదోగుల జీవితాలతో ఆడుకోవడం  జరుగుతుంది.
   ఇదే విషయాన్నీ  గౌరవనీయులు  వైద్య ఆరోగ్య శాఖ మంత్రివర్యులకు, వైద్య ఆరోగ్య శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ గారికి మరియు ప్రతీ జిల్లా కలెక్టర్లకు మర్యాధ పూర్వకం గా కలిసి మా ఉద్యోగ భద్రత విషయమై రిప్రజెంటేషన్స్ ఇవ్వడం జరిగింది.మేము ఎంత ప్రయత్నిచిన సిఎం గారిని కలవలేక పోయాం, మీ ద్వారా మా సమస్య ను గౌరవ ముఖ్యమంత్రివరులు వై ఎస్  జగన్ మోహన్ రెడ్డి గారి దృష్టికి తీసుకువెళ్లవలసిందిగా కోరుచున్నాము.