తెలంగాణా ఆర్టీసీ కార్మికుల న్యాయమైన డిమాండ్ కు ట్రేడ్ యూనియన్ సెంటర్ ఆఫ్ ఇండియా(టియుసిఐ) తన సంపూర్ణ మద్దతును ప్రకటిస్తుంది. ఆర్టీసీని ప్రభుత్వ పరం చేయాలి. ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం మాదిరి, తెలంగాణా ప్రభుత్వం కూడా ఆర్టీసీ సంస్థను ప్రభుత్వ ఆధీనంలో నడపాలి. ఉద్యోగులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలి. కార్మికుల న్యాయమైన డిమాండ్ ని పరిష్కరించకుండా 48వేల ఉద్యోగులను తొలగించామని ప్రభుత్వం ప్రకటించటం నిరంకుశమైన చర్య. ఇప్పటికైనా ప్రభుత్వ తన చర్యను ఉపసంహరించుకొవాలి. లేదంటే చరిత్రలో నిజాం నవాబుకి పట్టిన గతే ప్రస్తుత దొరలకు పడుతుంది. ప్రజాస్వామిక వ్యవస్థలో నిరంకుశ చర్యలకు తావులేదు. ఆర్టీసీ కార్మికుల ఉద్యమం కేవలం కార్మికులది మాత్రమే కాదు. యావత్తు తెలంగాణా ప్రజలది. కార్మికుల ఐక్య ఉద్యమానికి ఇతర అనేక తెలంగాణా కార్మిక, ఉద్యోగ, ప్రజాస్వామిక, ప్రగతిశీల శక్తుల మద్దతు, సంఘీభావం, సహాయ సహకారాలు మరింత అవసరం. సంఘటిత ఐక్య ఉద్యమాలే సమస్యకు ఏకైక పరిష్కార మార్గం. ప్రజా మద్దతు మరింత అవసరం. ఆంధ్ర ప్రదేశ్ టియుసిఐ తరుపున తెలంగాణా ప్రభుత్వాన్ని ఆర్టీసి కార్మికుల డిమాండ్లను చర్చలు ద్వారా, ప్రజాస్వామిక వాతావరణంలో పరిష్కరించాలని డిమాండ్ చేస్తున్నాము. ఇందుకు భిన్నంగా ప్రభుత్వం సమస్యను జఠిలం చేసుకుని, సంస్థను పైృవేటు పరం చేయాలని, ప్రైవేటు వ్యక్తులకు అప్పజెప్పాలని ప్రయత్నిస్తే ప్రజా ఉద్యమం తప్పదు. ప్రజాక్షేత్రంలో భవిష్యత్తులో ఓటమి తప్పదని హెచ్చరిస్తున్నాము.
తెలంగాణా ఆర్టీసీ కార్మికుల న్యాయమైన డిమాండ్