2022 ఎన్నికలకు సిద్ధం కావాలి
తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబునాయుడు

రాష్ట్రంలోని తెదేపా నాయకులకు కార్యకర్తలకు

2022 ఎన్నికలకు సిద్ధం కావాలి

'నాకు తెలిసి 2022 చివర్లోగాని 2023 ప్రారంభంలోగానీ జమిలీ ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. ఆ ఎన్నికలకు ఇప్పటినుంచే కార్యకర్తలంతా సిద్ధమవ్వాలి. జమిలీ లేకున్నా సాధారణ ఎన్నికలనాటికైనా తిరుగులేని నాయకత్వాన్ని రూపొందించుకోవాలి. అంతకుముందు స్థానిక ఎన్నికల్లో మన జెండా ఎగరాలి' అని చంద్రబాబు పిలుపునిచ్చారు. 'జగన్‌కు రెండోసారి అవకాశం ఇచ్చే పరిస్థితి రాదు. చిలక ప్రాణం మాంత్రికుడి వద్ద ఉన్నట్టు ఆయన చిట్టా అంతా భాజపా వాళ్ల వద్ద ఉంది. ఆయన మనల్ని చేసేదేమీ లేదు. నరేగా, నీరు-చెట్టు బిల్లులు ఇవ్వకపోవడంపై న్యాయస్థానాన్ని ఆశ్రయించనున్నాం. అప్పటికీ జాప్యమైతే తరువాత వచ్చేది మన ప్రభుత్వమే. వడ్డీతో సహా చెల్లిస్తాం' అని కార్యకర్తల్లో స్థైర్యం నింపారు. 'మొన్నటి ఎన్నికలు జగన్‌ చేయలేదు. ప్రశాంత్‌కిషోర్‌ విద్యార్థులను వేసుకుని ఊరూరా వ్యతిరేక భావాలను ప్రచారం చేయించారు. మనం గుర్తించేలోపే ఆ ప్రచారం ప్రజల్లోకి వెళ్లింది. ఎమ్మెల్యే అభ్యర్థులకు కూడా జగన్‌ డబ్బులివ్వలేదు. వేరేవారిని పెట్టుకుని పంచుకున్నారు. వాళ్ల నేతలపైనే నమ్మకం లేదనడానికి ఇదొక్కటే తార్కాణం' అని విమర్శించారు.