టీడీపీ అధినేత చంద్రబాబుకు పులివర్తి నాని సాదర స్వాగతం
ఏపీ మాజీ ముఖ్యమంత్రి, తెలుగు దేశం పార్టీ అధినాయకులు చంద్రబాబు నాయుడుకు చిత్తూరు జిల్లా టీడీపీ అధ్యక్షుడు పులివర్తి నాని సాదర స్వాగతం పలికారు. సోమవారం ఉదయం 8గంటలకు నెల్లూరు జిల్లా పర్యటన నిమిత్తం హైదరాబాద్ నుంచి రేణిగుంట విమానాశ్రయంకు చంద్రబాబు చేరుకున్నారు. అక్కడ నుంచి రోడ్డు మార్గం గుండా నెల్లూరు బయలుదేరి వెళ్ళారు. ప్రతిపక్ష నేతగా, నెల్లూరులో పార్టీని బలోపేతం చేయడానికి చంద్రబాబు నాయుడు చిత్తూరు జిల్లాకు రావటంతో భారీ ఎత్తున తెలుగు తమ్ముళ్లు స్వాగతం పలికారు. పులివర్తి నానితో పాటుగా మాజీ మంత్రి అమరనాథరెడ్డి పార్టీ ముఖ్య నాయకులు బాబుకు పుష్ప గుచ్చం అందించి సాదర స్వాగతం పలికారు. అలాగే త్వరలో జరిగే చిత్తూరు జిల్లా పర్యటనపై పార్టీ ముఖ్య నాయకులను ఆరా తీశారు.