ఆంధ్రప్రదేశ్ తూర్పుకాపు ఆత్మీయ కలియక విశాఖపట్నం జిల్లాలో  

విశాఖ వేదికగా గాజువాకలో ఆంధ్రప్రదేశ్ తూర్పుకాపు ఆత్మీయ కలియక:                                     కనీవినీ ఎరగని రీతిలో గాజువాక నియోజకవర్గ పరిధిలో తూర్పుకాపు ల పాలిట పెన్నిధి,తూర్పుకాపు ల ఆత్మ బంధువు,తూర్పుకాపు ల అవతార అంబెడ్కర్ అయిన ఆంధ్ర ప్రదేశ్ తూర్పుకాపు సంక్షేమ సంఘ రాష్ట్ర అధ్యక్షులు గౌరవ నీయులు, పెద్దలు శ్రీ శ్రీ శ్రీ పిసిని చంద్రమోహన్ గారి అధ్యక్షతన సుమారు 3000 మందికి పైగా శ్రీకృష్ణ దేవరాయ కల్యాణ మండపములో తూర్పు కాపు ఆత్మీయ కలయిక అంగరంగవైభవంగా జరిగింది. ఈ కార్యక్రమ ముఖ్య ఉద్దేశ్యం : -  రాష్ట్ర అధ్యక్షులు శ్రీ పిసిని చంద్ర మోహన్ గారు మాట్లాడుతూ                   రాష్ట్రంలో తూర్పుకాపు లు అన్నిరంగాల్లో అణచివేతకు గురౌతున్నామని ఆవేదన వ్యక్తం చేసారు . బీసీ డీ లొ ఉన్న తూర్పుకాపు లను బీసీ ఏ లోకి మార్చాలని ..ఉత్తరాంధ్ర మినహా పధి జిల్లాల్లో వలసులుగా కొన్ని దశాబ్దాలుగా నివశిస్తున్న తూర్పుకాపు లకు .ఓ .బి .సీ. సర్టిఫికెట్లు మంజూరీ చేసే దిశగా కేంద్ర . రాష్ట్ర ప్రభుత్వాలు కృషి చెయ్యాలని అన్నారు .తూర్పుకాపు కార్పొరేషన్ కు పాలక వర్గాన్ని ఏర్పాటు చేసి మాజాతి అభివృద్ధికి నాంది పలకాలని డిమాండ్ చేసారు .ఈ కార్యక్రమంలో హాజరైనవారు గౌరవ రాష్ట్ర వైస్సార్సీపీ ఎచ్చెర్ల అసెంబ్లీ శాసన సభ్యులు గౌ,, శ్రీ గొర్లె కిరణ్ కుమార్ గారు ముఖ్య అతిధిగా పాల్గొని మాట్లాడుతూ మన రాష్ర్ట ముఖ్యమంత్రి గారి దృష్టికి మన తూర్పుకాపు ల వెతలను,ఆవేదనను,మన జాతికి జరిగిన అసమానతను స్పష్టంగా అర్ధమయ్యే రీతిలో తెలియచేస్తామని అలాగే అసెంబ్లీలో కూడా పోరాడి నావంతు కృషి చేస్తానని తెలియ చేశారు. మరో మన తూర్పుకాపు ముద్దు బిడ్డ,మనజాతి పక్సపాతి అయిన  మాడుగుల అసెంబ్లీ శాసన సభ్యులు గౌరవనీయులు కరణం ధర్మశ్రీ గారు మాట్లాడుతూ మన జాతిని ఉద్దేశించి మాట్లాడుతూ తూర్పుకాపులు మన రాష్ట్రంలో ఉన్న 13 జిల్లాలలో కూడా నివసిస్తూ స్థిరపడి వుంటున్నారు వారందరికీ ఓబీసీ సెరిఫికెట్ వచ్చేలా గతంలో జి ఓ నెం 62 మరియు 65 లో పొందుపరిచినట్టుగా మరలా దానిని పునరిద్దరించేలా అమలు దిశగా మన జాతి శాసన సభ్యులుతో కలసి కృషి చేస్తానని మన జాతికి అన్నివిధాల నా సహాయ సహకారాలు అందిస్తానని తెలియ చేశారు , అలాగే భీమిలి మాజీ శాసన సభ్యులు గౌరవనీయులు శ్రీ కర్రి సీతారాము గారు ఈ కార్యమములో పాల్గొని మాట్లాడుతూ మన జాతి సంఘం ఆవిర్భావం చాలా సంతోషంగా ఉంది అందరూ ఐకమత్యంగా ఉండి సంఘాలను బలపరిస్తే ముందు మన గౌరవ శాసన సభ్యులు చెప్పిన అంశాలన్నీ తప్పనిసరిగా నెరవేరుతాయని ఆశాభావం వ్యక్తంచేశారు. అలాగే మన జాతికి ఏ అవసరం వచ్చినా నేను మీకు అండగా ఉంటానని తెలియచేసారు. అలాగే ప్రముఖ రాజకీయ విశ్లేషకులు,మానవతావాది,మనజాతి ముద్దు బిడ్డ గౌరవనీయులు శ్రీ కోడిగుడ్ల రవి బాబు గారు ఈ కార్యక్రమములో పాల్గొని మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వాలపై నెనుపోరాడి మనహక్కులను సాధించేదిసగా మాట్లాడి నావంతు కృషి చేస్తానని, మరియు గౌరవ శాసన సభ్యులు రాష్ట్రంలో మీకున్న పరిధిలో అసెంబ్లీలో మీ గళాన్ని విప్పి మాట్లాడగలిగితే కేంద్రంతో పోరాడి మీకు సహాయం చేస్తానని మన జాతి హక్కులను కాలరాసే హక్కు ఎవరికి లేదు అని తెలియపరుస్తూ సంఘానికి నా అవసరం ఏరూపంలో కావాలన్నా నేను మీకు అండగా ఉంటానని తెలియ పరిచారు. మరియు ఈ కార్యక్రమములో ముఖ్య అతిధిలుగా, విజయనగర జిల్లా వైస్సార్సీపీ వ్యవహారాల ఇంచార్జి గౌ,, శ్రీ మజ్జి శ్రీనివాసరావు గారు, దేశ విదేశాలలో ఖ్యాతి గడించి పల్సస్ అధినేతగా ఎంతో మందికి ఉపాధి కల్పిస్తున్న గౌ,, శ్రీ గేదెల శ్రీను బాబు గారు, రాష్ట్ర తూర్పుకాపు ప్రధాన కార్యదర్శి గౌ,, శ్రీ కరిమజ్జి మల్లేశ్వర రావు గారు,రాష్ట్ర తూర్పుకాపు ఉద్యోగ విభాగ కార్యదర్శి గౌ,, శ్రీ రట్టి శ్యాం సుందర్ గారు, రాష్ర్ట తూర్పుకాపు గౌరవ సలహాదారులు గౌ,, శ్రీ వావిలపల్లి జగన్నాధ నాయుడు గారు ,రాష్ర్ట తూర్పుకాపు ఉపాధ్యక్షులు గౌ,, శ్రీ, బి పి నాయుడు గారు ,రాష్ట్ర తూర్పుకాపు ప్రధాన కార్యదర్శి గౌ,, శ్రీ కురిటి మాధవ నాగేశ్వరరావు గారు ముఖ్య అతిధులు గా పాల్గొన్నారు. మరియు గౌరవ అతిథులుగా గాజువాక మరియు పారిశ్రామిక ప్రాంత కార్యవర్గ అధ్యక్షులు గౌ,,శ్రీ సావు శ్రీనివాసరావు గారు,గౌరవ అధ్యక్షులు గౌ,, శ్రీ  ఆసపాన మోహన్ రావు గారు,గౌరవ సలహాదారు గౌ,, శ్రీ పొడిలాపు నారాయణ రావు గారు, ప్రధాన కార్యదర్శి గౌ,, శ్రీ మూఢడ్ల గురు నాయుడు గారు,ఉపాధ్యక్షులు గౌ,, శ్రీ కిల్లారి వెంకట నాయుడు గారు,గౌ,, శ్రీ  కిలారి సాంభమూర్తి గారు, గౌ,, శ్రీ యర్లంకి రాజేశ్వర నాయుడు గారు, గౌ,, శ్రీ ఇరోతి గణేష్ గారు మరియు కార్యదర్సులు గౌ,, శ్రీ శెట్టి దామోదర్ నాయుడు గారు, గౌ,, శ్రీ నగిశెట్టి శ్రీనివాసరావు గారు, గౌ,,శ్రీ కడగల చిన్నారావు గారు, గౌ,, శ్రీ దాసరి రామరావు గారు, గౌ,, శ్రీ గూన వెంకట రావు గారు, మరియు కోసాధికారులు గౌ,, శ్రీ నడిమింటి వేణు గోపాల రావు గారు ,గౌ,, శ్రీ నడిమింటి కూర్మి నాయుడు గారు మరియు మహిళా కార్యవర్గ అధ్యక్షురాలు గౌ,, శ్రీమతి భూపతి జయలక్మి గారు,ఉపాధ్యక్షురాలు గౌ,, శ్రీమతి మజ్జి రాజేశ్వమ్మ గారు, ప్రధాన కార్యదర్శిలు గౌ,, శ్రీమతి లంకల మురళీ దేవి గారు, గౌ,, శ్రీమతి బెవర రమణమ్మ గారు,కార్యదర్శి గౌ,, శ్రీమతి వెలమ శెట్టి లక్మి గారు, కోసాధికారి గౌ,, శ్రీమతి భూపతి పద్మావతి గారు మరియు యూత్ కమిటీ కార్యవర్గాలు ,మహిలా కార్యవర్గాలు,వార్డ్ కమిటీ కార్యవర్గాలు                         ఆంధ్రప్రదేశ్ తూర్పుకాపు సంక్షేమ సంఘం, రి నెం 369/2018, గాజువాక కార్యాలయం, కణితి రోడ్, విశాఖపట్నం - 26