ఆర్టీసీ ప్రైవేటీకరణకు మేఘా ప్రణాళికతోనే పథక రచన - రేవంత్‌రెడ్డి
ఆర్టీసీ నష్టాలకు ప్రభుత్వ విధానాలే కారణమని కాంగ్రెస్ నేత రేవంత్‌రెడ్డి విమర్శించారు . డీజిల్‌పై పన్నులతో ఆర్టీసీ నష్టపోతోందన్నారు. విమానాల ఇంధనంపై వ్యాట్‌ను 16శాతం నుంచి ఒకశాతానికి తగ్గించారని తెలిపారు. ప్రభుత్వానికి ఏడాదికి రూ.300 నుంచి 500 కోట్ల నష్టం వస్తోందని చెప్పారు. ఆర్టీసీ డీజిల్‌పై వ్యాట్‌ ఎందుకు తగ్గించడం లేదని, వ్యాట్‌ తగ్గిస్తే ఆర్టీసీకి ఏడాదికి రూ.700 కోట్ల లాభం వస్తుందని తెలిపారు. విడిభాగాలపై రూ.150 కోట్ల పన్నులు విధిస్తోందని, బస్‌పాస్‌ రాయితీలు మూడేళ్లుగా రూ.700 కోట్లు బకాయిలున్నాయని రేవంత్‌రెడ్డి వెల్లడించారు.

 

''నష్టాలను తగ్గించకుండా ఆర్టీసీని ప్రైవేటీకరణ చేయాలని చూస్తున్నారు. ఆర్టీసీ ప్రైవేటీకరణ ఆలోచన సీఎం కేసీఆర్‌కు ఇప్పటికిప్పుడు రాలేదు. ఎలక్ట్రిక్‌ బస్సుల తయారీ కంపెనీ కోసమే ఆర్టీసీ ప్రైవేటీకరణ. మేఘా ప్రణాళికతోనే ఆర్టీసీ ప్రైవేటీకరణకు పథక రచన చేస్తున్నారు. రూ.50 వేల కోట్ల భూములను లీజుల పేరుతో కేసీఆర్‌ కుటుంబం తీసుకుంది. గౌలిగూడలో భూములను టీఆర్‌ఎస్‌ ఎంపీ లీజుకు తీసుకున్నారు. ఆర్టీసీ భూముల లీజుల వివరాలు సంస్థ బయటపెట్టాలి'' అని రేవంత్‌రెడ్డి డిమాండ్ చేశారు. 

Popular posts
రాష్ట్ర తొలి మహిళా సీజేజస్టిస్‌ హిమ ప్రమాణం
Image
తెలుగు జనతాపార్టీ సేన నియామకం
Image
కోనేరు కృష్ణపై సీఎం కేసీఆర్ సీరియస్
*లాక్ డౌన్ నిబంధనలకు విరుద్ధంగా శ్రీ బాలాజీ వైన్స్ లో మద్యం వ్యాపారం* *మేడ్చల్ జిల్లా జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని శ్రీ బాలాజీ వైన్స్ లో లాక్ డాన్ నిబంధనలను తుంగలో తొక్కిన యాజమాన్యం.* *భౌతిక దూరం పాటించకుండా విచ్చలవిడిగా చేస్తున్న మద్యం వ్యాపారం.* *కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కరోనా మహమ్మారిని కట్టడి చేయడానికి భౌతిక దూరం తప్పనిసరని నెత్తి నోరు మొత్తుకుని చెప్తున్నా సదరు వైన్స్ యజమానులు లాక్‌డౌన్‌ నిబంధనలకు తూట్లు పొడుస్తున్నారు. దీనిపై పోలీసు మరియు ఎక్సైజ్ శాఖ ఉన్నతాధికారులు తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుకుమతున్నారు.
Image
సాములోరూ...  సంబరాలు ఏమిటో..?