విద్యార్థినుల జీవితాలతో ఆట లాడుకుంటున్న ఉపాధ్యాయులు..

 


విద్యార్థినుల జీవితాలతో ఆట లాడుకుంటున్న ఉపాధ్యాయులు..


  *విద్యార్థినుల సి.యస్.ఈ 8,9 తరగతుల డేటా డిలీట్...!!!* 


*1300 మంది విద్యార్థినుల నుండి 300 చొప్పున అక్రమ వసూళ్లు...!!!* 


 *విద్యాలయంలో సర్వీస్ రికార్డ్ లు మాయం...!!!* 


 *నెల క్రితం వినుకొండ టౌన్ పోలీసులకు ఫిర్యాదు...!!!* 


 *ఓ కొలిక్కికూడా రాని కేసు...* 


*ఆందోళనలో ఉపాధ్యాయులు.....* 


గుంటూరు జిల్లా వినుకొండ పట్టణంలో జిల్లా పరిషత్ బాలికొన్నత పాఠశాల సరస్వతి నిలయంగా గత అనేక సంవత్సరాలుగా పెరుగడించింది 6 నుండి 10 తరగతుల్లో 1300 మంది విద్యార్థినులు విద్యాబుద్ధులు నేర్చుకుంటున్నారు ఈ పాఠశాల వినుకొండ నియోజకవర్గంలో 1వ వార్డు స్కూలుగా సుపరిచితం ఈ విద్యాలయం బాలికలకు ఏర్పాటు చేయబడింది ఈ ప్రాంతంలో ఈ విద్యాలయం ప్రసిద్ధి చెందింది.


గత రెండు సంవత్సరాల క్రితం ఈ పాఠశాలలో విద్యార్థినుల నుండి అక్రమ వసూళ్ళు జరగడంతో అప్పటి జిల్లా కలెక్టర్ కోన శశిధర్ నరసరావుపేట ఆర్.డి.ఓ ద్వారా విచారణ జరిపించి వెంటనే ప్రధానోపాధ్యాయులుని సస్పెండ్ చేశారు. 


ఈ పాఠశాల లో 1300 మంది విద్యార్థినులు చదువుకుంటున్నారు ఇప్పుడు ఈ సంవత్సరం లో ఈ విద్యాలయానికి శుస్తి చేసింది నయం చేయవలసిన విద్యాశాఖ అధికారులు పట్టించుకోవడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. 1300 మంది విద్యార్థినుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని పాఠశాల లో పరిస్థితులు చక్కదిద్దేందుకు చర్యలు తీసుకోవలసిన అధికారులు ప్రజాప్రతినిధులు నిమ్మకునిరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు. పాఠశాల నిర్వహణకు ప్రభుత్వం ప్రతి సవత్సరం నిధులు విడుదల చేస్తుంది ప్రభుత్వం నిధులు మంజూరు చేసినా పేద విద్యార్థినుల వద్ద అక్రమంగా డబ్బులు వసూళ్ళ మాత్రం ఆగడం లేదు 6,7 తరగతుల విద్యార్థినుల నుండి 200 చొప్పున 8,9,10 విద్యార్థినుల నుండి 300 చొప్పున ఇప్పటికే రూ.2,00,000 లక్షల రూపాయల దాకా వసూళ్ళ జరిపినట్లు సమాచారం అంతే కాకుండా గత కొంత కాలం క్రితం 9.10 తరగతుల పిల్లల డేటా కంప్యూటర్ నుండి డిలీట్ చేశారు. ఈ విషయాలపై విద్యాశాఖ అధికారులు అస్సలు పట్టించుకోకుండా ఉండటం వల్ల ఏకంగా ఉపాధ్యాయుల,సిబ్బంది సర్వీస్ రికార్డ్ లు మాయం అయ్యాయి ఈ రికార్డు లు ప్రిన్సిపల్ అధీనం లో వుంటాయి సర్వీస్ రికార్డ్ లు మాయం కావడంతో విషయం పోలీస్ స్టేషన్ కు చేరింది సరిగ్గా నెల క్రితం వినుకొండ పోలీస్ స్టేషన్ లో రికార్డుల దొంగతనం పై ఫిర్యాదు నమోదు జరిగింది ఈ రికార్డు లు కొన్ని నరసరావుపేట పోస్ట్ ఆఫీస్ నుండి గత కొన్ని రోజుల క్రితం ఓ అజ్నాత వ్యక్తి వినుకొండ విద్యాశాఖ అధికారులకు పోస్ట్ చేశాడని విశ్వసనీయ సమాచారం ఇప్పటికైన విద్యాశాఖ అధికారులు ప్రజాప్రతినిధులు పోలీసులు ఈ విషయం పై ప్రత్యేక దృష్టి సారించి సమర్థవంతంగా పాఠశాల నిర్వహణకు చిత్త శుద్ధి కలిగిన భాద్యులను నియమించి జరిగిన పరిణామాల పై చర్యలు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు