మహిళా ఎంపీడీవో సరళ ఇంటిపై వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి దాడి

మహిళా ఎంపీడీవో సరళ ఇంటిపై వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి దాడి చేసిన సంగతి తెలిసిందే. ఈ ఘటనపై మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు మండిపడ్డారు. విధి నిర్వహణలో నిజాయతీగా ఉన్నందుకు ఓ మహిళా అధికారిపై వైసీపీ ఎమ్మెల్యే ఒకరు దౌర్జన్యం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తనకు న్యాయం చేయాలని కోరుతూ అర్ధరాత్రి వేళ ఆ మహిళా అధికారి పోలీస్ స్టేషన్ కు వెళ్తే... కేసు నమోదు చేయడానికి కూడా పోలీసులు జంకారంటే... ఈ రాష్ట్రంలో పోలీసు వ్యవస్థ ఉన్నట్టా? లేనట్టా? అని ప్రశ్నించారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు.