మరో ఆర్టీసీ కార్మికుడు ఆత్మహత్య చేసుకున్నాడు
తెలంగాణలో ఆర్టీసీ కార్మికులు చేస్తున్న సమ్మె ఇంతకింతకూ ఉద‌్రిక్తంగా మారుతోంది. ఖమ్మం జిల్లాకు చెందిన ఆర్టీసీ డ్రైవర్ శ్రీనివాస్ రెడ్డి ఆత్మహత్యకు పాల్పడి రోజు కూడా గడవకముందే హైదరాబాద్‌లో మరో ఆర్టీసీ కార్మికుడు ఆత్మహత్య చేసుకున్నాడు. రాజేంద్రనగర్‌ కుల్సుంపురాలో కండక్టర్‌ సురేందర్‌గౌడ్‌ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. రాణిగంజ్‌ డిపోలో సురేందర్‌గౌడ్‌ కండక్టర్‌గా పనిచేస్తున్నాడు.

 

ఆర్టీసీ కార్మికుల విషయంలో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో సురేందర్‌గౌడ్‌ ఉద్యోగం పోయింది. దీంతో మనస్తాపం చెందిన సురేందర్‌గౌడ్‌ ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. దీంతో ఆర్టీసీ కార్మికుల సమ్మె ఏ పరిస్థితులకు దారి తీస్తుందోనన్న ఆందోళన వ్యక్తం అవుతోంది.