ఎక్కడున్నారయ్యా   ఉన్నారా    ఎగుచుక్కలయ్యారా

 


ఎక్కడున్నారయ్యా   ఉన్నారా                                          *ఎగుచుక్కలయ్యారా*                          దగాపడ్డ హృదయాలు మీ రాకకై ఎదురు చూస్తూ కనుపాపలు చచ్చే వరకు కను మూయ కుండా ఎర్రి చూపులు చూస్తున్నాయ్ ఈ మనువాద సామ్రాజ్యంలో చచ్చు మగాడిలా చచ్చి చావలేక బ్రతకవలసి వస్తుంది మా నాయనలు చెప్తుంటే విన్నాం ఓ నాడు భూమి కోసం భుక్తి కోసం ఆకలి పోరాటాలు చేసేటోళ్లంటా అదే భూమి కోసం ఈనాడు ఆత్మాహుతి ప్రాణదానం చేయవలసి వస్తుంది చచ్చి చెడినా ఫలితాలు మాత్రం శూన్యం గుండెల్లో ఎంత బరువుంటే చావడానికి కూడా సిద్దపాటు ఉండాలి ఊరంతా నీదే భూమి అంటారు పెద్ద పాలేరు మాత్రం నీది కాదు చావుపోరా పీడా వదిలిద్ది అంటాడు ఇద్దరూ నా వాళ్లే అంటాడు కానీ ఈ దళిత నీచుడికి చచ్చినా న్యాయం చెయ్యొదంటాడు పోలీసులను కూడా న్యాయం చెయ్యకుండా అధికార బంధంలో బందీ చేయడం ఎంత వరకు ధర్మం డా.బి ఆర్ అంబెడ్కర్ చూచన ప్రకారం దళితులకు ప్రత్యేక నియోజకవర్గా లు ఇచ్చి ఉంటే దళితుల కు ఉన్న అరకొరా భూములు చట్టాలను అడ్డు పెట్టుకుని ఆక్రమించుకోవాలని చూసే వారా మమ్మల్ని మనుషుల్లా గుర్తించండి బలిదానాలు కోరుకుంటే ముందుండేది దళిత వర్గాలే అంబేద్కర్ పెట్టిన బిక్ష తో ఉద్యోగాలు సంపాదించిన దళిత అధికారులారా సాటి మనిషిగా సాటిదళితునికి జరుగుతున్న అన్యాయాన్ని గుర్తించండి మీకు ఉద్యోగాలు ఇచ్చింది భారత రాజ్యాంగం ఈ రాజ్యాంగం లో ప్రజాసేవకులు శాసనాలు చేసేవారే కానీ శాసించే వారు కాదు ఏది అన్యాయమో ఏది న్యాయమో గుర్తించండి మరో ప్రత్యామ్నాయ న్యాయం కోసం ప్రజలు ఎదురు చూసే పరిస్థితులు కల్పించకండి..