కేసీఆర్ ప్రభుత్వంపై మోత్కుపల్లి నర్సింహులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కొత్త ఉద్యోగాలు భర్తీ చేయకుండా.. ఇప్పుడున్న ఉద్యోగాలను తొలగిస్తున్నారని మండిపడ్డారు. శ్రీనివాసరెడ్డిది ప్రభుత్వం చేసిన హత్యేనని ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఆర్టీసీలో ఒక్క కార్మికుడిని కూడా కేసీఆర్ నియమించలేదని, కానీ ఉన్న ఉద్యోగులు.. 48వేల మందిని తొలగిస్తున్నట్లు చెప్పడం చాలా దురదృష్టకరమని, సిగ్గుచేటని అన్నారు. తెలంగాణ రావడానికి ఆర్టీసీ, ఉద్యోగులు ముఖ్య కారకులని.. ఇప్పుడు వారిని ఉద్యోగాల నుంచి తొలగించడం దారుణమని అన్నారు. వెంటనే కేసీఆర్ తన పదవికి రాజీనామా చేయాలని మోత్కుపల్లి డిమాండ్ చేశారు.
కేసీఆర్ ప్రభుత్వంపై మోత్కుపల్లి నర్సింహులు విమర్శలు