తూర్పుగోదావరి జిల్లా తునిలో దారుణం


తూర్పుగోదావరి జిల్లా తునిలో దారుణం జరిగింది.ఆంధ్రజ్యోతి విలేఖరి కాతా సత్యనారాయణ ను గుర్తు తెలియని దుండగులు కత్తితో దాడి చేసి హత్య చేశారు.తునిమండలం ఎస్.అన్నవరం గ్రామానికి చెందిన సత్యనారాయణ ఆంధ్రజ్యోతిలో   తొండంగి అర్బన్ విలేకరి గా పనిచేస్తున్నాడు. ఈరోజు సాయంత్రం తన స్వగ్రామం అయిన టి.వెంకటాపురం గ్రామం నుండి ఇంటికి వస్తుండగా ఎస్. అన్నవరం శివారు వేంకటేశ్వరస్వామి గుడి సమీపంలో తన ఇంటికి దగ్గరలో గుర్తు తెలియని వ్యక్తులు అతని పై దాడి చేసి తలపై కత్తితో బలంగా కొట్టి హత్య చేశారు. ఈ సంఘటనలో సత్యనారాయణ అక్కడిక్కడే మృతి చెందాడు. రక్తపు మడుగులో పడివున్న సత్యనారాయణ మృతదేహం వద్ద కుటుంబ సభ్యులు బోరున విలపిస్తున్నారు. సంఘటన స్థలానికి పోలీసులు చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు.