ఇసుక కుత్రిమ కొరతపై 36 గంటల నిరవధిక దీక్షకు సిద్దమైన మాజీ మంత్రి కొల్లు రవీంద్ర*
మచిలీపట్నంలో కోనేరుసెంటర్ లో నిరవదిక దీక్షకు కూర్చోనున్న కొల్లు రవీంద్ర
ఇసుక కొరతపై రేపు టిడిపి పార్టీ చేపట్టే 36 గంటల నిరవధిక దీక్షకు వ్యతిరేకంగా కోనేరు సెంటర్లో ధర్నా కు పిలుపునిచ్చిన వైస్సార్సీపీ నాయకులు ఇరుపార్టీలు ఆందోళనకు పిలుపునివ్వడంతో పట్టణం లో ఉద్రిక్త వాతావరణం.
30 పోలీస్ యాక్ట్ అమలు
మచిలీపట్నం సబ్-డివిజన్ లో ఈనెల 14 వ తేదీ వరకు 30 పోలీస్ యాక్ట్ అమల్లో ఉందని బందరు DSP మెహబూబ్ బాషా గారు స్పష్టం చేశారు.
ఈ సందర్బంగా అధికారుల అనుమతి లేకుండా మచిలీపట్నంలో కోనేరు సెంటర్, ఇతర సెంటర్లలో ఎటువంటి ధర్నాలు, రాస్తారొకో, సభలు, సమావేశాలు, ర్యాలీలు నిర్వహించడానికి వీలులేదన్నారు.
ఒకవేళ ఎవరైనా నిబంధనలను ఉల్లంఘిస్తే చట్టపరమైన చర్యలు తీసుకునేందుకు సిద్ధంగా ఉన్నామని డియస్పి హెచ్చరించారు. ప్రజలకు రక్షణ, శాంతి భద్రతలకు ఎలాంటి భంగం కలగకూడదనే ఈ యాక్ట్‌ను అమలు చేస్తున్నట్లు DSP గారు ఉత్తర్వుల్లో వెల్లడించారు.