సీఎం జగన్‌ను కలిసిన చిరంజీవి దంపతులు


సీఎం జగన్‌ను కలిసిన చిరంజీవి దంపతులు



అమరావతి : ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని మెగాస్టార్‌ చిరంజీవి దంపతులు మర్యాదపూర్వకంగా కలిశారు. సోమవారం మధ్యాహ్నం హైదరాబాద్‌ నుంచి ప్రత్యేక విమానంలో విజయవాడకి చేరుకున్న చిరంజీవి... భార్య సురేఖతో కలిసి తాడేపల్లిలోని సీఎం జగన్‌ నివాసానికి వెళ్లారు. ఈ సందర్భంగా సీఎం జగన్‌ వారిని సాదరంగా ఆహ్వానించారు. వైఎస్‌ జగన్‌ ముఖ్యమంత్రి అయ్యాక చిరంజీతో భేటీ కావడం ఇదే తొలిసారి.  ఈనెల 5న తెలంగాణ గవర్నర్‌ తమిళసై సౌందరరాజన్‌ను చిరం‍జీవి మర్యాదపూర్వకంగా కలిసిన సంగతి తెలిసిందే. 'సైరా నరసింహారెడ్డి' సినిమా చూడాలని ఆమెను చిరంజీవి కోరారు. చిరంజీవి ఆహ్వానం మేరకు గవర్నర్‌ ప్రత్యేకంగా ఈ సినిమాను వీక్షించారు. తొలి స్వాతంత్ర్య సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి కథ ఆధారంగా తెరకెక్కిన 'సైరా నరసింహారెడ్డి' సినిమా ఈనెల 2న విడుదలై బాక్సాఫీస్‌ వద్ద సందడి చేస్తోంది. ప్రేక్షకుల నుంచి మంచి స్పందన రావడంతో భారీ వసూళ్లు సాధించింది. సినిమా హిట్‌ కావడంతో మెగా ఫ్యామిలీతో పాటు అభిమానులు పండగ చేసుకుంటున్నారు.


Popular posts
*లాక్ డౌన్ నిబంధనలకు విరుద్ధంగా శ్రీ బాలాజీ వైన్స్ లో మద్యం వ్యాపారం* *మేడ్చల్ జిల్లా జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని శ్రీ బాలాజీ వైన్స్ లో లాక్ డాన్ నిబంధనలను తుంగలో తొక్కిన యాజమాన్యం.* *భౌతిక దూరం పాటించకుండా విచ్చలవిడిగా చేస్తున్న మద్యం వ్యాపారం.* *కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కరోనా మహమ్మారిని కట్టడి చేయడానికి భౌతిక దూరం తప్పనిసరని నెత్తి నోరు మొత్తుకుని చెప్తున్నా సదరు వైన్స్ యజమానులు లాక్‌డౌన్‌ నిబంధనలకు తూట్లు పొడుస్తున్నారు. దీనిపై పోలీసు మరియు ఎక్సైజ్ శాఖ ఉన్నతాధికారులు తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుకుమతున్నారు.
Image
పేకాట శిబిరంపై స్పెషల్ ఎన్ఫోర్స్‌మెంట్ అధికారులు దాడి
డంపింగ్ యార్డ్‌ను తరలించాలంటూ స్థానికులు ఆందోళన
రాష్ట్ర తొలి మహిళా సీజేజస్టిస్‌ హిమ ప్రమాణం
Image
వైసీపీ లో చేరికలు