నగరంలోని కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. బాలాపూర్, మల్లాపూర్, వాదియే హుదా, కొత్తపేట్ ఆర్‌సీఐ రోడ్డు తదితర ప్రాంతాల్లో గంట సేపు భారీ వర్షం కురిసింది. సాయంత్రం 6.30 గంటల నుంచి రాత్రి 7.30 గంటల వరకు ఎడతెరిపి లేకుండా కురిసిన భారీ వర్షానికి పలు ప్రాంతాల్లో చెట్ల కొమ్మలు విరిగి రోడ్లపై పడ్డాయి. ఉధృత గాలి, వానతో ఆ పరిసర ప్రాంతాల్లో కరెంటు సరఫరా నిలిచిపోయింది. 7.30 గంటలకు వర్షం తగ్గుముఖం పట్టడంతో జనాలు ఊరట చెందారు.
నగరంలోని కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షం