• జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కల్యాణ్ గారు ఈ రోజు ఉత్తరాఖండ్ రాజధాని డెహ్రడూన్ చేరుకొని అక్కడి నుంచి హరిద్వార్ వెళ్లారు.
• హరిద్వార్ లోని మాత్రి సదన్ ఆశ్రమానికి చేరుకొని ఆ ఆశ్రమ నిర్వాహకులు స్వామి శివానంద మహారాజ్ తో భేటీ అయ్యారు.
• హరిద్వార్ మాత్రి సదన్ ఆశ్రమం- గంగా ప్రక్షాళన పోరాటానికి ఒక వేదికగా నిలిచింది. స్వామి నిగమానంద ఈ ఆశ్రమంలోనే గంగా ప్రక్షాళన కోసం 115 రోజులు అన్నపానీయాలు మాని నిరాహార దీక్ష చేసి ప్రాణ త్యాగం చేశారు. 33ఏళ్ల వయసులోనే స్వామి నిగమానంద ప్రాణాలు విడిచారు.
• ప్రొఫెసర్ జి.డి.అగర్వాల్ సైతం గంగా ప్రక్షాళన కోసం పొరాడి ప్రాణాలు విడిచారు.
• ఈ ఆశ్రమంలో ఉన్న స్వామి నిగమానంద సమాధిని దర్శించి, శ్రీ పవన్ కల్యాణ్ గారు నివాళులు అర్పించారు
• శ్రీ పవన్ కళ్యాణ్ గారు మాత్రి సదన్ ఆశ్రమంలో స్వామి శివానంద మహారాజ్ ను కలిసి చర్చించారు. పవిత్ర గంగా నది తీవ్రంగా కలుషితం అవుతోందని స్వామి శివానంద మహారాజ్ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రక్షాళన కోసం చేస్తున్న పోరాటానికి దక్షిణాది నుంచి ఎవరూ మద్దతు ఇవ్వడం లేదని చెప్పారు. తమ పోరాటానికి అండగా నిలవాలని శ్రీ పవన్ కల్యాణ్ గారిని కోరారు.
• శ్రీ పవన్ కల్యాణ్ గారు మాట్లాడుతూ “గంగా నదిని కలుషితం చేయడం అంటే మన సంస్కృతిని కలుషితం చేయడమే” అన్నారు.
• స్వామి శివానంద మహారాజ్ గంగానదికి హారతినిచ్చారు. ఈ కార్యక్రమంలో శ్రీ పవన్ కల్యాణ్ గారు పాల్గొన్నారు. రామన్ మెగసెసే అవార్డ్ గ్రహీత, 'వాటర్ మ్యాన్' శ్రీ రాజేంద్ర సింగ్ కూడా పాల్గొన్నారు.
జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కల్యాణ్ గారు ఈ రోజు ఉత్తరాఖండ్