సభ్యత్వాల కోసం సన్నదమౌతున్న యూనియన్లు...

 


సభ్యత్వాల కోసం సన్నదమౌతున్న యూనియన్లు...


జర్నలిస్టుల సంక్షేమం,హక్కుల సాధన కోసం కన్న... మీడియా యాజమాన్యాల కోసం మాత్రం యూనియన్లు నిరంతరం అలుపెరుగని కృషి  చేస్తున్నాయన్న సంగతి ఆయా ప్రాంతాల్లో జర్నలిస్టులకు బాగా తెలుసు... 


యూనియన్ల నాయకులారా సభ్యత్వాల కోసం మాకు
*కబుర్లు చెప్పవద్దు.*


జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇప్పించడం లో విజయం సాధించామని చెప్పుకొనే యూనియన్లు  ఎక్కడ ఇప్పిచ్చారో సమాధానం చెప్పాలి??? రాష్ట్ర వ్యాప్తంగానా లేక మారుమూల ప్రాంతంలోనా???


గ్రామీణ *విలేకరులకు ప్రభుత్వం  వేతనాలు* ఇవ్వాలని కోరే కొన్ని యూనియన్లు , యాజమాన్య ల నుంచి ఇప్పటివరకు పాత్రికేయులకు ఏమి ఇప్పిచ్చారో చెప్పాలి...😊


మరీ, ఆయా మీడియా సంస్థల నుంచి *యూనియన్లు తోఫాలు తీసుకుని* పాత్రికేయుల సమస్యలు పరిష్కారం చేయలేదని అనుకోవాలా ...!!!😢


*రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పాత్రికేయులకు మనవి..*


అది పికము... ఇది పికము అనే యూనియన్ల ను *సంక్షేమం,కనీస వేతనాలు, ఉద్యోగ భద్రత కోసం*... నిలదీయండి... 


*ప్రమాద భీమా ఎందుకు అమలులో లేదని ప్రశ్నించండి*


 ప్రమాదంలో పాత్రికేయులు మృతి చెందితే వారి కుటుంబాలకు చేయూత ఏ యూనియన్ ఇప్పించిందో...ధైర్యంగా చెప్పుకోమని చెప్పండి..


*గొప్పలు చెప్పుకునే ఈ యూనియన్లు ప్రమాద భీమా గురించి ప్రభుత్వం పై ఒత్తిడి ఎందుకు తేలేదో సమాధానం చెప్పాలి...*


ఇటీవల *రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన ప్రముఖ ఛానల్ కెమెరా మెన్  కుటుంబానికి అటు మీడియా యాజమాన్యం నుంచి కానీ, ఇటు ప్రభుత్వం నుంచి కానీ ఎలాంటి పరిహారం ఈ యూనియన్లు అందించాయో* తెలుసుకోండి..


మేలుకోండి సోదరులారా...


*సంక్షేమం లేదు... భద్రత లేదు...  పాత్రికేయుల మనుగడ కూడా నానాటికి ప్రశ్నర్ధకంగా మారింది...*


యూనియన్లు సాధించలేనప్పుడు...  మన కుటుంబాల కోసం మనమే ఐక్యమై సాధించుకుందాం...


రండి.... *సంక్షేమం కోసం అడుగులు కలపండి...* అందరం కలిసి సాధించుకుందాం...


జర్నలిస్టుల ఐక్యతే... సంక్షేమానికి,భద్రతకు,మనుగడకు పునాది...