రూ.15 వేల లంచం తీసుకుంటూ ఏసీబీకి తెలకపల్లి ఎస్సై

నాగర్‌కర్నూల్‌ జిల్లా   తెలకపల్లి ఎస్సై  వెంకటేశ్వర్లు పశువుల సంత కాంట్రాక్టర్‌ నుంచి రూ.15 వేల లంచం తీసుకుంటూ ఏసీబీకి దొరికిపోయాడు. ప్రతినెలా మామూళ్లు ఇవ్వాలని ఎస్సై వేధిస్తుండడంతో కాంట్రాక్టర్‌ పరమేశ్వర్‌ ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. బుధవారం రాత్రి ఎస్సై తన నివాసంలో రూ.15వేల లంచం తీసుకుంటుండగా అధికారులు పట్టుకున్నారు.