నిందితులను వెంటనే అరెస్ట్ చేయాలి. 

 


APJF ఖండన 
నిందితులను వెంటనే అరెస్ట్ చేయాలి. 


తుని ఆంధ్రజ్యోతి రూరల్ విలేకరి,మిత్రుడు  సత్యనారాయణ హత్య దిగ్బ్రాంతికి గురిచేసింది.ఈ చర్యను APJF (Andhra Pradesh Journalist Forum) తీవ్రంగా ఖండిస్తోంది.నిందితులను పోలీస్లు తక్షణం గుర్తించి అరెస్ట్ చేయాలని APJF East Godavari unit డిమాండ్ చేశారు. ప్రజాస్వామ్య వాదులంతా సత్తిబాబు హత్యను ఖండించాలని పిలుపునిస్తున్నాం .సత్యనారాయణ ఇంటి సమీపంలో దారుణ హత్యకు గురై రోడ్ పై పది ఉండటం కొన్ని రోజుల క్రితం ఇదే ప్రదేశములో కొంతమంది దుండగులు ఇతనిపై హత్యాయత్నానికి ఒడిగట్టడం గమనిస్తే వారికి ఈ హత్యతో సంబంధం ఉందని అనుమానించాల్సి విషయం.సత్తిబాబు హత్య విషయం తెలిసిన వెంటనే అతని కుటుంబ సభ్యులు , మీడియా మిత్రులు స్థానిక పోలీస్ లకు ఫిర్యాదు చేసినప్పటికీ సరిగా స్పందించకపోవడం ... ఘటన స్థలానికి రాకపోవడం అనేక అనుమానాలకు తావు ఇస్తున్నది.సత్తిబాబు తలపై .. శరీరం పై బలమైన కత్తిగాట్లు ఉండటంతో అక్కడికక్కడే చనిపోయారని మిత్రులు తెలిపారు.సత్తిబాబు మృతి  ప్రతిఒక్క రిని కలచివేస్తోంది. హత్యలద్వారా పాత్రికేయుల గొంతు నొక్కాలని చేస్తే మరింత పట్టుదలతో పాత్రికేయులు ప్రజాస్వామ్యంలో తమ కర్తవ్యాన్ని నెరవేర్చుతూ ముందుకు సాగుతారని స్పష్టం చేస్తున్నాం .సత్తిబాబు కుటుంబానికి APJF పక్షాన ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాం.ఆయన ఆత్మకు శాంతికలగాలని భగవంతుని ప్రార్ధిస్తున్నాము.