ప్రభుత్వ ఆసుపత్రుల్లో పి ఓ ఆకస్మిక తనిఖీలు
మండలంలోని జడ్డంగి, రాజవొమ్మంగి ప్రభుత్వ ఆసుపత్రుల్లో రంపచోడవరం ఐటీడీఏ పి ఓ నిశాంత్ కుమార్ బుధవారం రాత్రి ఆకస్మిక తనిఖీలు చేపట్టారు.
జడ్డంగి, రాజవొమ్మంగి ప్రభుత్వ ఆసుపత్రిలో రాత్రి 9 గంటల సమయంలో రికార్డులను క్షుణ్నంగా పరిశీలించి. సిబ్బంది పనితీరుపై ఆరా తీశారు. అనారోగ్యంతో బాధపడుతున్న రోగులకు వైద్య సేవలు సక్రంగా చేస్తున్నది లేనిది, మందులు ఇస్తున్నారా! లేదా అనే దానిపై వివరణ కోరగా మందులు మేము బయట మెడికల్ షాప్ నుండి కొనుగోలు చేసుకుని తెచ్చుకుంటున్నామని వారు తెలిపారు. అనారోగ్యంతో వచ్చిన రోగులకు సరైన వైద్య సేవలు అందించాలని వైద్యులకు పి ఓ సూచించారు. మందుల కొరత ఉందని గుర్తించిన ఆయన వెంటనే సమస్యలు పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. పి ఓ వెంట వైద్యులు శిరీష, రమ్య శ్రీ సిబ్బంది ఉన్నారు.