*విజయవాడ ఆంధ్రా హాస్పిటల్ లో దారుణం*
డబ్బుకోసం ఆంధ్రా హాస్పిటల్.. మరొక దారుణానికి వడిగట్టింది. ఈసారి వారి నిర్లక్ష్యానికి ఒక పసిప్రానం అనంత వాయువుల్లో కలిసిపోయింది. గత నెల 9వ తేదీన ఆసియా అని పేరు గల మూడేళ్ల చిన్నారిని నిమ్ము కారణంగా విజయవాడ పాత ఆంధ్రా హాస్పిటల్ లో అడ్మిట్ చేశారు. నెల రోజులుగా అక్కడే ఐసీయు లో ట్రీట్మెంట్ తీసుకుంటున్న పాప.. హఠాత్తుగా ఈ రోజు ప్రాణాలు విడిచినట్లు అక్కడి డాక్టర్లు సమాధానం చెప్పడం జరిగింది. నిజానికి ఆ పాప ఈ రోజు(అక్టోబర్ 3న) మధ్యాహ్నం 3గంటలకే ప్రాణాలు కోల్పోగా.. ఆ విషయాన్ని రాత్రి 8.30 గంటల వరకూ పాప తల్లితండ్రులకు తెలియనివ్వలేదు, ఈ నేపథ్యంలో ఆంధ్రా హాస్పటల్ డాక్టర్ల పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే పాప ట్రీట్మెంటు కోసం 7లక్షల రూపాయలు పైగా ఖర్చు పెట్టిన తల్లితండ్రులు.. తమ చిట్టితల్లి క్షేమంగా ఇంటికి తిరిగి వస్తుందని ఆశపడ్డారు. కానీ కూతురి చావు వార్తను డాక్టర్లు మెల్లగా, మెల్లగా చెప్పడంతో అయోమయంతో ఒక్కసారిగా నిర్ఘాంతపోయారు. ఆంధ్రా హాస్పటల్ వారి నిర్లక్ష్యంపై పాప కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. హాస్పిటల్ యాజమాన్యం వారి నిర్లక్ష్యానికి.. ఖర్చు పెట్టిన డబ్బుతో పాటు కన్న కూతుర్ని కూడా కోల్పోయామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మా పాప మరణానికి హాస్పిటల్ మేనేజ్మెంట్ నిర్లక్ష్యమే కారణమని వారు వాపోతున్నారు. తమ కూతురి చావుకి తగిన న్యాయం చేయాలని ఆసియా కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు. ప్రస్తుతం పోలీసులు కేస్ నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.