మారేడుమిల్లి-చింతూరు మధ్య ఓ పర్యాటక బస్సు బోల్తాపడింది.


  మారేడుమిల్లి-చింతూరు మధ్య ఓ పర్యాటక బస్సు బోల్తాపడింది.


 ఘాట్‌రోడ్డులోని వాల్మీకి కొండ వద్ద బస్సు అదుపుతప్పి ఈ ప్రమాదం చోటుచేసుకుంది.


 ఈ ఘటనలో 8 మంది మృతి చెందారు..


 పలువురు తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. 


* మారేడుమిల్లి వ‌ద్ద అడ‌వుల్లో ఈ సంఘ‌ట‌న జ‌రిగింది


 * అక్క‌డ టెలిఫోన్ క‌మ్యూనికేష‌న్ కూడా అంద‌డం లేదు


* మారేడుమిల్లి నుంచి స‌హాయం కోసం అధికారులు బ‌య‌లుదేరారు


* ప్రైవేటు ట్రావెల్సు బ‌స్సు ఘాట్ రోడ్డులో అదుపు త‌ప్పి లోయ‌లో ప‌డిపోయింది. 


* మృతుల వివ‌రాలు తెలియాల్సి ఉంది


* భ‌ద్రాచ‌లం నుంచి రాజ‌మండ్రికి ఈ బ‌స్సు వ‌స్తోంద‌ని తెలుస్తోంది


 


* సంఘ‌ట‌నా స్థాలానికి హుటాహుటిన బ‌య‌లు దేరిన మారేడుమిల్లి పోలీసులు
* అడ‌విలో పాములేరు వ‌ద్ద బ‌స్సు లోయ‌లో ప‌డిన‌ట్లు స‌మాచారం
* మారేడుమిల్లి స‌బ్ ఇన్‌స్పెక్ట‌ర్ శివ‌రామ‌కృష్ణ, పోలీసు బృందం స‌హాయ కార్య‌క్ర‌మాల కోసం బ‌య‌లు దేరారు.
* మృతుల‌కు సంబంధించి క‌చ్చిత‌మైన స‌మాచారం ఎవ‌రి వ‌ద్దా లేదు
* సంఘ‌ట‌న ప్రాంతంలో సెల్‌ఫోన్ సిగ్న‌ళ్లు లేవు