జమ్మూ-కశ్మీర్‌లో పర్యాటకుల సందడి తిరిగి ప్రారంభం కానుంది.

జమ్మూ-కశ్మీర్‌లో పర్యాటకుల సందడి తిరిగి ప్రారంభం కానుంది. గురువారం (ఈ నెల పదోతేదీ) నుంచి పర్యాటకులను అనుమతించాలని గవర్నర్‌ సత్యపాల్‌ మాలిక్‌ నిర్ణయించారు. 370 అధికరణం రద్దు నేపథ్యంలో రెండు నెలల క్రితం రాష్ట్రంలోని పర్యాటకులందరూ వెళ్లి పోవాలంటూ ప్రభుత్వం అత్యవసర ఆదేశాలను జారీ చేసిన విషయం తెలిసిందే. జమ్మూ-కశ్మీర్‌లో ప్రస్తుత పరిస్థితి, శాంతిభద్రతల అంశాలపై సోమవారం గవర్నర్‌ సమీక్షించారు. సాధారణ పరిస్థితుల పునరుద్ధరణలో భాగంగా పర్యాటకులను అనుమతించాలని కీలక నిర్ణయం తీసుకున్నారు.