కుల సంఘాల సభలకి, సమావేశాలకి వెళ్లడం కాదు

 


అమెరికా వచ్చి 16 ఏళ్ళయినా… ఏనాడూ కుల సంఘాల సభలకి, సమావేశాలకి వెళ్లడం కాదు కదా కనీసం వాటితాలూకు చర్చలకి కూడా ఆమడ దూరంలో ఉండే నన్ను కూడా ఇటీవల కమ్మవాడినని… అందుకే నాయుడు గారి మీద అభిమానంతో Facebook లో పోస్ట్ లు రాస్తున్నానని కొంత మంది పక్కన పెట్టడం గమనించా… బ్రతుకుదెరువు కోసం సప్త సముద్రాలు దాటి ఇక్కడికి వచ్చిన జనాల్లో కూడా ఈ కులాభిమానం చూసి అసహ్యమేసింది సార్… అసలు నాయుడు గారి మీద అభిమానం కేవలం కమ్మ కులస్తులకే ఉందా..? మిగిలిన వాళ్ళెవ్వరికీ లేదా…? ఇదంతా ఆయన్ని ఎలక్షన్స్ లో ఓడించడానికి కొంత మంది కొన్నేళ్ళుగా తెర వెనుక నడుపుతున్న పెద్ద కుట్ర మాత్రమే… 


2010 – అప్పటికి బిల్ క్లింటన్ అమెరికా అధ్యక్షుడు కూడా కాదు. ఏదో కాన్ఫరెన్స్ పని మీద ఢిల్లీ వచ్చిన ఆయన.. ఒక ఇంటర్వ్యూలో “ఇండియాలో నాక్కుడా మంచి మిత్రులున్నారు ” అని పలువురి పేర్లు చెప్తూ వాళ్ళతో పాటు నాయుడు గారి పేరు కూడా చెప్పారు… అప్పటికి నాయుడు గారు కూడా అధికారంలో లేరు కేవలం ఇంతకు ముందు ఉన్న పరిచయంతో చెప్పారే కానీ ఆయనేమీ నారా బిల్ క్లింటన్ చౌదరి కాదు…. 


అపరకుబేరుడు బిల్ గేట్స్ – పొరపాటున ఒక డాలర్ నోటు కింద పడేసుకుంటే వంగిదాన్ని తీసుకునేలోపు ఆయన సంపద 600 డాలర్లు పెరుగుతుంది.. దావోస్ లో ప్రపంచ ఆర్ధిక సదస్సు జరుగుతున్న సమయంలో అప్పటిదాకా నాయుడు గారు ఆయన కోసం 4 గంటలు ఎదురు చూసి ఇప్పుడే పక్కకి వెళ్లారని చెప్తే మళ్ళీ తిరిగి నాయుడు గారు వచ్చే దాకా కొన్ని నిమిషాల పాటు ఎదురు చూసారు… అది ఆయన నాయుడుగారికిచ్చే గౌరవం… అంతేకానీ ఆయనేమీ నందమూరి బిల్ గేట్స్ చౌదరి కాదు..  


ప్రపంచ ప్రఖ్యాత CISCO కంపెనీ అధినేత జాన్ చాంబర్స్ 11 గంటలకి అప్పాయింట్మెంట్ ఇస్తే నాయుడు గారు ఒక అరగంట ముందుగానే వచ్చారని తెలుసుకొని ముఖ్యమైన మీటింగులో ఉన్నా కూడా మధ్యలోనే ఆపి ఎదురెళ్లి నాయుడు గారికి స్వాగతం చెప్పారు… అది పెద్ద పెద్ద వ్యాపారవేత్తలు కూడా నాయుడు గారికి ఇచ్చే విలువ… అంతేకానీ ఆయనేమీ అక్కినేని జాన్ చాంబర్స్ చౌదరి కాదు… 


కియా కార్ల కంపెనీ కోసం ఆంధ్రతో పాటు, అన్ని రాష్ట్రాలు పోటీపడుతుంటే.. కంపెనీ ప్రతినిధులకు దిక్కుతోచక… UPA ప్రభుత్వ హయాంలో అత్యంత నిజాయితీపరుడైన, కేంద్రమంత్రిగా ఉన్న ఏకే ఆంటోనీ గారిని సలహా కోసం సంప్రదిస్తే… నిస్సందేహంగా ఆంధ్రాలో స్థాపించండి… నాయుడుగారి vision చాలా గొప్పది.. అది దేశంలో మీ కంపెనీ ఎదుగుదలకు ఎంతో దోహదపడుతుంది అని చెప్పారు.. అంతమాత్రాన ఆయన దగ్గుబాటి ఆంటోనీ చౌదరి అయిపోతాడా…? 


మాజీ IPS అధికారి ఇటీవల.. ప్రతి రాష్ట్రానికి నాయుడు గారి లాంటి ముఖ్యమంత్రి ఉంటే అన్నిరాష్ట్రాలు అభివృద్ధిలో పోటీ పడతాయి.. అసలు రాష్ట్రాలకి కేంద్ర ప్రభుత్వంతో అవసరం లేదు అని చెప్పారు… అందుకని ఆమె యార్లగడ్డ కిరణ్ బేడీ చౌదరి అయిపోతారా…? 


ప్రపంచ ప్రఖ్యాత వ్యక్తులు కూడా ఆయన గురించి గొప్పగా చెపుతున్నారంటే దానికి కారణం రాష్ట్రాన్ని అభివృద్ధి బాట పట్టించడానికి ఆయన చేపట్టిన ఎన్నో గొప్ప సంస్కరణలు… టెక్నాలజీని రాష్ట్రానికి పరిచయం చేసిన ఆయన ముందుచూపు.. అంతేకానీ కులం కాదు… అధికారం కోసం మీ అతితెలివితో కమ్మ కులానికి వ్యతిరేకంగా ఒక ఉద్యమమే మొదలెట్టారు… ఈవీఎంల్లో మోసాలతో పాటు ఈ ప్రచారం కూడా తోడయ్యి అధికారం మీ సొంతం అయింది.. అయినా కూడా ఇంకా ఎందుకు ఏడుపులు… ఇంకా అలానే పట్టుకులాగుతుంటే తెగుతుంది.. కాబట్టి సోది ఏడుపులు ఆపి పరిపాలనలో మీ మార్క్ చూపించండి….