పోలవరం విషయంలో దర్యాప్తు చేయ్యమంది అంటూ వైసీపీ ప్రచారం
ఢిల్లీ హైకోర్ట్, చంద్రబాబు పై పోలవరం విషయంలో దర్యాప్తు చేయ్యమంది అంటూ వైసీపీ ప్రచారం.. జరిగిన వాస్తవం ఇది అయితే, ఇలా ప్రచారం !*

 

నిన్నటి నుంచి వైసీపీ అనుకూల మీడియాతో పాటుగా, సోషల్ మీడియాలో వైసిపీ వర్గం మొత్తం, చంద్రబాబు పై సిబిఐ దర్యాప్తు చేస్తున్నారు, చంద్రబాబు పై విచారణ చెయ్యమని, హైకోర్ట్ ఆదేశాలు ఇచ్చింది అంటూ తెగ హడావిడి చేస్తున్నారు. చాలా మంది ఇది నిజం అని కూడా నమ్మారు. అయితే ఢిల్లీ హైకోర్ట్ ఇచ్చిన తీర్పు వేరు, ఇక్కడ వైసీపీ చేస్తున్న ప్రచారం వేరు. అసలు జరిగింది ఇది. పెంటపాటి పుల్లారావు అని ఈయన మొన్నటి దాక సామాజికవేత్తగా ఉన్నారు. ఎక్కువగా పోలవరం మీద వ్యతిరేకంగా కధనాలు రాస్తూ, అలాగే సాక్షిలో ఎడిటోరియల్స్ రాస్తూ ఉండేవారు. ఎన్నికల ముందు, ఉన్నట్టు ఉండి జనసేన పార్టీలో చేరారు. జగన్ కి అనుకూలం అని పేరు ఉన్న వ్యక్తీ, పవన్ పక్కన చేరటంతో అందరూ అవాక్కయ్యారు. అయినా సరే, గతంలో మాదిరిగా, పోలవరం పై కేసులు వేస్తూనే ఉన్నారు. ఇదే కోవలో, ఢిల్లీ హైకోర్ట్ లో ఒక కేసు వేసారు.

 

పోలవరం ప్రాజెక్ట్ విషయంలో ఎన్నో అవకవతవకలు జరుగుతున్నాయని, ఈ ప్రాజెక్ట్ నిర్మాణం విషయంలో, పారదర్శకత లేదని తెలియచేస్తూ, ఢిల్లీ హైకోర్ట్ లో కేసు వేసారు. రూ.16,010 వేల కోట్లుగా ఉన్న ప్రాజెక్టు అంచనా వ్యయాన్ని రూ.57,941 కోట్లకు పెంచారని, ఇక్కడే అవినీతి జరుగుతుంది అనే విషయాన్ని పిటీషన్ లో దాఖలు చేసారు. ప్రధాని మోడీ, ఎన్నికల ప్రచారంలో, పోలవరం పై చేసిన రాజకీయ విమర్శలను కూడా, ఈ పిటీషన్ లో వేసారు. ఈ మొత్తం వ్యవహారం పై కోర్ట్ జోక్యం చేసుకోవాలని, పోలవరం పై సిబిఐ ఎంక్వయిరీ వెయ్యాలని, ఆదేశాలు ఇవ్వాలి అంటూ, పెంటపాటి పుల్లారావు, ఢిల్లీ హైకోర్ట్ లో పిటీషన్ వేసారు. పుల్లారావు తరఫు న్యాయవాది కె.శ్రవణ్‌ కుమార్‌ వాదించారు.

 

వాదనలు విన్న హైకోర్ట్, పుల్లారావు దాఖలు చేసిన ప్రజాప్రయోజన వ్యాజ్యం పై విచారణకు ఢిల్లీ హైకోర్టు నిరాకరించింది. అయితే ఆ పిటిషన్‌ను వినతిపత్రంగా పరిగణించాలని మాత్రమే కేంద్ర జలశక్తి శాఖకు సూచించింది. ఈ పిటిషన్‌పై బుధవారం ఢిల్లీ హైకోర్టు చీఫ్‌ జస్టిస్‌ నరేంద్రభాయ్‌ పటేల్‌, జస్టిస్‌ హరిశంకర్‌తో కూడిన ధర్మాసనం వాదనలు విని, కేసు డిస్మిస్ చేసింది. కోర్ట్ ఇలా స్పష్టంగా చెప్తే, వైసిపీ మాత్రం, చంద్రబాబు పై దర్యాప్తుకు హైకోర్ట్ ఆదేశించింది అంటూ హడావిడి చేసారు. ఇక్కడ కోర్ట్, కేంద్రాన్ని ఈ విషయం పై చూడామని మాత్రమే చెప్పింది. అయితే ఇప్పటికే కేంద్రం, ఈ విషయం పై పార్లమెంట్ వేదికగానే, పోలవరంలో ఎలాంటి అవినీతికి తావులేదు అని స్వయంగా ప్రకటించిన సంగతి తెలిసిందే. అయినా చంద్రబాబు పై బురద చల్లాలి కాబట్టి, ఇలా ప్రచారం చేసింది వైసీపీ...