యజమానురాలిని కాపాడబోయి ప్రాణాలు కోల్పోయింది

 


ఓ పెంపుడు కుక్క తన యజమానురాలిని కాపాడబోయి ప్రాణాలు కోల్పోయింది. ఈ విషాదకర ఘటన సికింద్రాబాద్‌లోని లాలాపేట్‌లో చోటుచేసుకుంది.

ఆస్తి వివాదంలో తల్లి, సోదరిపై సోదరుడు నాగరాజు దాడి చేస్తుండగా పెంపుడు కుక్క అతడిని ప్రతిఘటించింది. దీంతో కోపోద్రేకుడైన నాగరాజు.. కుక్కను కాలితో తన్ని.. అంతటితో ఆగక కుక్క గొంతు నులిమి చంపేశాడు. దీంతో పోలీసులు నిందితుడిపై కేసు నమోదు చేసి అదుపులోకి తీసుకున్నారు. చనిపోయిన కుక్కను పోస్టుమార్టానికి తరలించారు.