మద్యం దుకాణాల నిర్వహణకు టెండర్ నోటిఫికేషన్ విడుదల

తెలంగాణ రాష్ట్రంలో మద్యం దుకాణాల నిర్వహణకు ఇవాళ టెండర్ నోటిఫికేషన్ విడుదల కానుంది. రాష్ట్రవ్యాప్తంగా బుధవారం నుంచి దరఖాస్తుల స్వీకరణకు అధికారులు ఏర్పాట్లు చేశారు. ఈనెల 9 నుంచి 16 వరకు(ఆదివారం మినహా) కొత్త మద్యం దుకాణాలకు దరఖాస్తులు స్వీకరించనున్నారు. ఈనెల 18వ తేదీన ఉదయం 11 గంటల నుంచి కలెక్టర్ సమక్షంలో లాటరీ తీసి దుకాణాలను కేటాయిస్తారు. దరఖాస్తుదారులు నాన్ రిఫండబుల్ ఫీజు రూ.2లక్షల డీడీ చెల్లించాలి. నూతన మద్యం విధానం నవంబరు ఒకటో తేదీ నుంచి అమల్లోకి రానుంది. ఈనెల 30లోపు కొత్త మద్యం దుకాణాల యజమానులకు లైసెన్స్‌లు అందజేసి నవంబర్ 1 నుంచి కొత్త యాజమాన్యాల ఆధ్వర్యంలో మద్యం విక్రయిస్తారు