వైస్సార్ కంటి వెలుగు' ప్రారంభించిన మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి


వైస్సార్ కంటి వెలుగు' ప్రారంభించిన మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి


ఉరవకొండ:
వైఎస్సార్‌ కంటివెలుగు కార్యక్రమాన్ని శుక్రవారం ఉరవకొండ నియోజకవర్గం కూడేరు మండల కేంద్రంలో కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాలలో వైస్సార్సీపీ నేత, మాజీ ఎమ్మెల్యే వై. విశ్వేశ్వరరెడ్డి రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు.విద్యార్థినిలతో ముచ్చటించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ...రాష్ట్రంలో కంటి చూపు లేకుండా ఇబ్బందులు పడకూడని ప్రతి వ్యక్తికి ఉచితంగా కంటి చూపు ఇవ్వాలన్నదే ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆశయమని అన్నారు. ప్రతిపక్షాలు ముఖ్యమంత్రి చేస్తున్న అభివృద్ధి పనులను చూసి ఓర్వలేకపోతున్నారని ఎద్దేవా చేశారు.ఈ కార్యక్రమంలో వైస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.