సమ్మె చేసే కార్మికులపై కఠినంగా వ్యవహరించాలి - సీఎం కేసీఆర్‌
ఆర్టీసీ సమ్మెపై సీఎం కేసీఆర్‌ ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. సమ్మె చేసే కార్మికులపై కఠినంగా వ్యవహరించాలని నిర్ణయం తీసుకున్నారు. శనివారం సాయంత్రం 6 గంటలల్లోపు విధుల్లో చేరకపోతే వేటు తప్పదని ఆర్టీసీ యాజమాన్యం హెచ్చరించింది. విధుల్లో చేరినవారికి రక్షణ కల్పించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇకపై కార్మికసంఘాలతో చర్చలు జరపవద్దని, ప్రభుత్వం నియమించిన సీనియర్‌ ఐఏఎస్‌ అధికారుల కమిటీని ప్రభుత్వం రద్దు చేసింది. రవాణాశాఖ కమిషనర్‌గా సందీప్‌ సుల్తానియా నియామించారు.

తాత్కాలిక ప్రాతిపదికన 6 వేల నియామకాలు ఆర్టీసీ చేపట్టింది. 4 వేల మంది డ్రైవర్లు, 2 వేల మంది కండక్టర్ల నియామకం చేపట్టనున్నారు. ఆదివారం నుండి పూర్తిస్థాయిలో బస్సుల్ని నడుపుతామని ఆర్టీసీ యాజమాన్యం చెబుతోంది. ఇంత వరకు ఒక్క కార్మికుడు కూడా విధుల్లో చేరలేదని, సాయంత్రం 6 గంటలల్లోపు విధుల్లో చేరకపోతే వేటు తప్పదని ఆర్టీసీ యాజమాన్యం హెచ్చరించింది.