బేషరతుగానే వైసీపీలో చేరాను - మాజీ ఎమ్మెల్యే ఆకుల సత్యనారాయణ

బేషరతుగానే వైసీపీలో చేరానని రాజమహేంద్రవరం మాజీ ఎమ్మెల్యే ఆకుల సత్యనారాయణ అన్నారు. శుక్రవారం తన నివాసంలో ఆయనను వైసీపీ రూరల్‌ కోఆర్డినేటర్‌ ఆకుల వీర్రాజు మర్యాదపూర్వకంగా కలసి పార్టీలో చేరినందుకు అభినందనలు తెలిపారు. ఈసందర్భంగా మాజీ ఎమ్మెల్యే ఆకుల విలేకరులతో మాట్లాడుతూ తాను ఏమీ ఆశించి పార్టీలోకి రాలేదని, ముఖ్యమంత్రి జగన్‌ చేస్తున్న పాలన, ప్రజా సంక్షేమం కోసం చేపడుతున్న పథకాలను చూసి పార్టీలోకి వచ్చానన్నారు. తనకు రూరల్‌ కోఆర్డినేటర్‌ ఇస్తారని జరుగుతున్న ప్రచారం పూర్తిగా అవాస్తవమన్నారు. రూరల్‌లో, అర్బన్‌లో పార్టీని మరింతగా బలోపేతం చేసేందుకు రెండు నియోజకవర్గాల నాయకులతో కలసి పని చేస్తానన్నారు.