దుర్గామాత విగ్రహానికి గిన్నిస్‌బుక్‌ ఆఫ్‌ వరల్డ్‌ రికార్డు

గన్‌ఫౌండ్రి డివిజన్‌ ఇసామియాబజార్‌లో నవదుర్గా నవరాత్రి ఉత్సవ సమితి నిర్వాహకులు గులాబ్‌ శ్రీనివాస్‌ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన 50 అడుగుల దుర్గామాత విగ్రహానికి గిన్నిస్‌బుక్‌ ఆఫ్‌ వరల్డ్‌ రికార్డు దక్కింది. ఈ మేరకు ఆదివారం గిన్నిస్‌ బుక్‌ ఆ్‌ఫ్‌ వరల్డ్‌ రికార్డ్స్‌ సీఈఓ సుమంత్‌ ఇసామియాబజార్‌కు విచ్చేసి సరస్వతి ఉపాసకులు దైవజ్ఞశర్మతో కలిసి గులాబ్‌ శ్రీనివాస్‌కు అవార్డును అందజేశారు. ఈ సందర్భంగా గులాబ్‌ శ్రీనివాస్‌ మాట్లాడుతూ 25మంది కళాకారులతో 50రోజుల పాటు విగ్రహాన్ని తయారు చేసినట్లు తెలిపారు. విగ్రహాన్ని మట్టితో రూపొందించినట్లు తెలిపారు. 21 సంవత్సరాలుగా సంస్థ ఆధ్వర్యంలో అమ్మవారి విగ్రహం ఏర్పాటు చేసి పూజలు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. అరుదైన ఘనత దక్కడం పట్ల ఆయన సంతోషం వ్యక్తం చేశారు.