పశుసంవర్ధక, మత్స్య, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి శ్రీ తలసాని శ్రీనివాస్ యాదవ్ జన్మదిన వేడుకలు
ఈ నెల 6 వ తేదీన  రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి శ్రీ తలసాని శ్రీనివాస్ యాదవ్ జన్మదిన వేడుకలను అమీర్ పేట డివిజన్ పరిధిలోని ధరంకరం రోడ్డులోని మున్సిపల్ గ్రౌండ్ లో trs పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానుల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించనున్నారు. మధ్యాహ్నం 12.00 గంటలకు మంత్రి అభిమానులు, కార్యకర్తల సమక్షంలో మున్సిపల్ గ్రౌండ్ లో కేక్ కట్ చేస్తారు. ఎవరు కూడా బొకేలు, శాలువాలు తీసుకురావద్దని మంత్రి సూచించారు. బహుమతులు తేవడానికి బదులుగా మీ మీ ప్రాంతాల్లో పేదలకు అన్నదానం, రోగులకు పండ్ల పంపిణీ వంటి కార్యక్రమాలు నిర్వహించాలని మంత్రి కోరారు.