ఈ ఆర్థిక సంవత్సరంలో జీఎస్టీ వసూళ్లు మూడో నెల కూడా తగ్గాయి

ఈ ఆర్థిక సంవత్సరంలో జీఎస్టీ వసూళ్లు మూడో నెల కూడా తగ్గాయి. సెప్టెంబర్ నెలలో జీఎస్టీ వసూళ్ళు రూ.91,916 కోట్లుగా ఉన్నాయి. అంతకుముందు రెండు నెలలు కూడా రూ.లక్ష కోట్ల కంటే తగ్గాయి. ఆగస్ట్ నెలలో జీఎస్టీ వసూళ్లు రూ.98,202 కోట్లు కాగా ఇప్పుడు అంతకంటే తగ్గాయి. గత ఏడాది (2018) సెప్టెంబర్ నెలలోనే రూ.94,442 కోట్లు. గత ఏడాది ఇదే నెల కంటే కూడా తగ్గాయి.


Popular posts