స్వాతంత్య్ర సమరయోధుల సేవలు చిరస్మరణీయం

 


స్వాతంత్య్ర సమరయోధుల సేవలు చిరస్మరణీయం


 


అక్టోబర్ 2  న గొప్ప స్వాతంత్ర్య సమరయోధుడు మన జాతిపిత శ్రీ మోహన్ దాస్ కరంచంద్ గాంధీ గారి జయంతి మరియు స్వాతంత్ర్య  సమర
యోధులు శ్రీ లాల్ బహాదుర్  శాస్త్రి గారి  జయంతి సందర్బంగా


డోన్  పట్టణంలో తారకరామానగర్ లోని సామాజిక కార్యకర్త కార్యలయం లో సామాజిక కార్యకర్త డోన్ పి. మహమ్మద్ రఫి ఆధ్వర్యం లో  అంజి,
సి.వెంకటేశ్వర్లు, వడ్డె వెంకటేశ్వర్లు ,ఆటోధను,
వెంకటరాముడు,నరేష్,అందరు కలిసి గొప్ప స్వాతంత్ర్య సమరయోధుడు మన  జాతిపిత శ్రీ మోహన్ దాస్ కరంచంద్ గాంధీ గారి జయంతి మరియు శ్రీ లాల్ బహూదూర్ శాస్త్రి గారి జయంతి  సందర్బంగా వారి  చిత్ర పటాలకు పూల మాల వేసి ఘణంగా నివాళి అర్పించారు. వారిని స్మరించుకున్నారు.
ఈ సందర్బంగ సామాజిక కార్యకర్త పి. మహమ్మద్ రఫి మాట్లాడుతూ 
*మన దేశ స్వాతంత్య్ర సమరయోధులను, శాస్త్రవేత్తలను ,మహనీయులను, సమాజానికి సేవలు అందించిన ప్రతి ఒక్కరిని స్మరించుకుంటూ వారి అడుగుజాడల్లో నడవాలని సామాజిక కార్యకర్త డోన్ పి.మహమ్మద్ రఫి తెలిపారు*


1) శ్రీ"మోహన్ దాస్ కరంచంద్ గాంధీ" 1869 అక్టోబర్ 2 వ తేదీన  గుజరాత్ లోని పోర్ బందర్లో ఒక సామాన్య సాంప్రదాయక కుటుంబములో జన్మించాడు. ఆయన తండ్రి పేరు కరంచంద్ గాంధీ, తల్లి పుతలీ బాయి. గాంధీ చదువు పోర్ బందర్ లోను,రాజ్‌కోట్ లోను కొనసాగింది.19సంవత్సరాల 
వయసులో (1888 లో) న్యాయశాస్త్ర
విద్యాభ్యాసానికి గాంధీ ఇంగ్లాండు వెళ్ళాడు. 
ఆయనకు బెర్నార్డ్ షా వంటి ఫేబియన్లతో పరిచయం ఏర్పడింది. ఈ కాలములోనే ఆయన చదువూ, వ్యక్తిత్వమూ, ఆలోచనా సరళీ రూపు దిద్దుకొన్నాయి.1891లో ఆయన పట్టభద్రుడై భారతదేశానికి తిరిగివచ్చాడు. మన దేశం లో బ్రిటిష్ వారు  జరుపుతున్న ఆగడాలను సహించలేక అహింసావాదం తో స్వాతంత్ర్య
పోరాటం సాగించిన మహనుభావులు.  ప్రజలు ఆయనను జాతిపితగా గౌరవిస్తారు. సత్యము, అహింసా గాంధీ నమ్మే సిద్ధాంత మూలాలు. సహాయ నిరాకరణ, సత్యాగ్రహము ఆయన ఆయుధాలు.కొల్లాయి గట్టి, చేత కర్రబట్టి, నూలు వడకి, మురికివాడలు శుభ్రం చేసి, అన్ని మతాలూ, కులాలూ ఒకటే అని చాటిన ఆ మహాత్ముడు బ్రిటిష్ సామ్రాజ్యాన్ని గడగడలాడించాడు.సత్యాగ్రహము,
అహింస పాటించడానికి ఎంతో ధైర్యము కావాలని బోధించాడు.ఆయన ఆంగ్లేయుల పాలన నుండి భారతదేశానికి స్వాతంత్ర్యము సాధించిన నాయకులలో అగ్రగణ్యుడు.శ్రీ మోహన్ దాస్ కరంచంద్ గాంధీ  - జనవరి 30, 1948 స్వర్గస్తులైనారు.
2) శాస్త్రి  గారు 1904 అక్టోబర్ 2  జన్మించారు. 
శాస్త్రి గారు గాంధీజీ పిలుపుతో ఉప్పు సత్యాగ్రహఉద్యమం లో  పాల్గొన్నాడు. అతను స్వాతంత్ర్య ఉద్యమానికి మద్దతుగా వ్యక్తిగత సత్యాగ్రహం నిర్వహించినందున ఒక సంవత్సరం పాటు జైలు లో ఉన్నాడు.1942 ఆగస్టు 8 న దేశ వ్యాప్తంగా ఆంగ్లేయులు భారతదేశం విడిచి పోవాలనే డిమాండ్ తో గాంధీజీ క్విట్‌ ఇండియాఉద్యమం లో శాస్త్రి  చురుగ్గా  పాల్గోన్నారు. 1947 లో భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తరువాత అతను భారతదేశ ప్రభుత్వంలోచేరి జవహర్ లాల్ నెహ్రూ 
ప్రభుత్వంలో మొదట రైల్వే మంత్రిగా, తరువాత హోంమంత్రిగానే కాక ఇతర భాద్యతలను కూడా చేపట్టాడు. ఆ తరువాత మన భారతదేశానికి  రెండవ  ప్రధానమంత్రి అయ్యారు. శాస్త్రి  గారి నినాదమైన "జై జవాన్ జై కిసాన్"  ప్రజల హృదయాల్లో గుర్తుండిపోయింది. ఆతర్వాత 1966 జనవరి 11 న స్వర్గస్తులైనారు.మన 
మందరం  స్వాతంత్ర్య  సమరయోధుల
అడుగుజాడల లో నడుద్దామని సామాజికకార్యకర్త డోన్ పి. మహమ్మద్ రఫి కోరారు