జగన్ కు అమిత్ షా అపాయింట్మెంట్ విషయంలో ఢిల్లీలో జరిగింది ఇది

*జగన్ కు అమిత్ షా అపాయింట్మెంట్ విషయంలో ఢిల్లీలో జరిగింది ఇది అంటూ అసలు విషయం చెప్పిన సుజనా చౌదరి...*


బీజేపీలో రాజ్యసభ ఎంపీ సుజనా చౌదరి ఈ రోజు మీడియాతో చిట్ చాట్ నిర్వహించారు. 
ఈ సందర్బంగా, అమిత్ షా తో జగన్ భేటీ పై వచ్చిన వార్తల పై, ఆయన మాట్లాడుతూ అక్కడ జరిగిన విషయం చెప్పారు. అమిత్ షా కు జగన్ ఇచ్చిన వినతి పత్రం బేస్ లెస్ అని సుజనా చౌదరి అన్నారు. రెవెన్యూ లోటు విషయం లో తప్పుడు లెక్కలతో జగన్ ఢిల్లీ వచ్చారని సుజనా అన్నారు. అమిత్ షా - జగన్ భేటీ ల పై ఉద్దేశం గురించి వ్యాఖ్యానించను అని, అయితే ఆయన అపాయింట్మెంట్ విషయంలో వచ్చిన వార్తల పై స్పందించారు. అమిత్ షా తో అపాయింట్మెంట్ విషయం లో సిఎంవో సరిగా కోఆర్డినేట్ చేసుకోలేదని, ఆ తప్పుని అమిత్ షా కార్యాలయం మీదకు నెట్టేస్తున్నారని సుజనా అన్నారు. అపాయింట్మెంట్ కుదిరిన తరువాత రావాలి కాని, ఇక్కడకు వచ్చి ఆయనకు కుదరని టైంలో, అపాయింట్మెంట్ కావాలని చెప్పటం, కుదరకపోతే అమిత్ షా ని నిందించటం సరి కాదని అన్నారు.


ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతున్న విషయాలు గమనిస్తుంటే అసలు రాష్ట్రంలో పరిపాలన ప్రారంభమైనట్లు లేదని అన్నారు. ఎన్నికలు ఎప్పుడో ఉన్నా గెలిచి నాలుగు నెలలే అయినా ఇప్పటి నుంచే జగన్ ఓట్ల రాజకీయం ప్రారంభించారని సుజనా అన్నారు. ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్న విషయంలో శ్రీశైలం లో జలవిద్యుత్ కేంద్రం లో జరుగుతున్న తంతే కారణం అని అన్నారు. శ్రీశైలం లో జలవిద్యుత్ కేంద్రం లో రిపేర్లు కూడా చేయించుకోలేక పోయారని సీలేరులో కాలువకు గండి పడిందని అందువల్లే విద్యుత్ ఉత్పత్తి జరగడం లేదని ప్రభుత్వం చెప్పింది అని, అది నిజమే అని సుజనా చెప్తూ, ఆ గండి పడి ఇప్పటికి 70 రోజులు అయ్యింది అని ఆ విషయం మర్చిపో కూడదు అని అన్నారు.ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతున్న విషయాలు గమనిస్తుంటే, అసలు రాష్ట్రంలో పరిపాలన ప్రారంభమైనట్లు లేదని అన్నారు. ఎన్నికలు ఎప్పుడో ఉన్నా, గెలిచి నాలుగు నెలలే అయినా, ఇప్పటి నుంచే జగన్ ఓట్ల రాజకీయం ప్రారంభించారని సుజనా అన్నారు. ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్న విషయంలో, శ్రీశైలం లో జలవిద్యుత్ కేంద్రం లో జరుగుతున్న తంతే కారణం అని అన్నారు. శ్రీశైలం లో జలవిద్యుత్ కేంద్రం లో రిపేర్లు కూడా చేయించుకోలేక పోయారని, సీలేరులో కాలువకు గండి పడిందని, అందువల్లే విద్యుత్ ఉత్పత్తి జరగడం లేదని ప్రభుత్వం చెప్పింది అని, అది నిజమే అని సుజనా చెప్తూ, ఆ గండి పడి ఇప్పటికి 70 రోజులు అయ్యింది అని, ఆ విషయం మర్చిపోకూడదు అని అన్నారు.


70 రోజుల నుంచి గండి పూడ్చ లేక, విద్యుత్ ఉత్పత్తి చెయ్యలేక, దీనివల్ల 500 కోట్లతో బయట నుంచి విద్యుత్ కొంటున్నారని సుజనా అన్నారు. పోలవరం ప్రాజెక్ట్ పరినామాలపై కేంద్ర జలశక్తి శాఖ అసంతృప్తి గా ఉందని సుజనా అన్నారు. అద్దె ఇంటికి, సొంత ఇంటికి ఒకే టెండర్ పిలిచినట్లు పోలవరం టెండర్లు పిలిచారని అన్నారు. విభజన హామీల ను సాదించుకోవడానికి 22 మంది ఎంపీ.లు ఏమి చేస్తున్నారని అసలు కేంద్రం ఎంత ఇవ్వాలి అనే దానిపై రాష్ట్రం శ్వేత పత్రం విడుదల చెయ్యాలని అన్నారు. ఇప్పుడు కొత్తగా రాజధాని పై అపోహలు సృష్టిస్తున్నారని, రాజధాని లో 9 వేల కోట్ల పనులు జరిగితే పీటర్ కమిటీ రిపోర్ట్ అంటూ 30 వేల కోట్ల దుబారా అని ఎలా చెపుతారని ప్రశ్నించారు. 2023 నాటికి జమిలీ ఎన్నికలు ఖాయమని సుజనా అన్నారు.