ఇరాక్ లో ప్రధాని అదిల్ కి వ్యతిరేఖంగా దేశవ్యాప్త నిరసనలు

ఇరాక్ లో ప్రధాని అదిల్ కి వ్యతిరేఖంగా దేశవ్యాప్త నిరసనలు కొనసాగుతున్నాయి. బాగ్దాద్ లో జరిగిన ఆందోళన హింసాత్మకంగా మారింది. ఐదు రోజులుగా నిరసనలు తీవ్రస్థాయికి చేరాయి. అయితే అల్లర్లలో సుమారు 73 మంది మృతి చెందారు. మరో 1500 మంది వరకు గాయపడ్డారు. ప్రభుత్వ అవినీతి, నిరుద్యోగం, తాగునీటి సరఫరాలో ఇబ్బందులు, విద్యుత్ కోతలను వ్యతిరేకిస్తూ .. ప్రజలు వేలాదిగా రోడ్లపైకి వస్తున్నారు.