రంగారెడ్డి జిల్లా ట్రెజరీ ఫోరమ్(టీటీఎన్జీవోఏ) అధ్యక్షులుగా ఎస్. శ్రీకాంత్


ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ట్రెజరీ ఫోరమ్(టీటీఎన్జీవోఏ) అధ్యక్షులుగా ఎస్. శ్రీకాంత్ ఎన్నికయ్యారు. ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ట్రెజరీ ఫోరమ్ ఎన్నికలు బుధవారం జిల్లా టీఎన్జీవో భవనంలో జరిగాయి. జిల్లా టీఎన్జీవో యూనియన్ అధ్యక్ష, కార్యదర్శులు లక్ష్మణ్, బుచ్చిరెడ్డి, టీటీఎన్జీవో రాష్ట్ర కన్వీనర్ పర్వతాలు సమక్షంలో ఈ ఎన్నికలు నిర్వహణ జరిగింది. ఈ ఎన్నికల్లో జిల్లా ట్రెజరీ ఫోరమ్ అధ్యక్షుడిగా ఎస్. శ్రీకాంత్ ఎన్నికవగా కార్యదర్శిగా కే. శివకుమార్, ట్రెజరర్‌గా కుమారి, కీర్తి ఎన్నికయ్యారు. ఈ కార్యక్రమంలో టీటీఎన్బీవోఏ రాష్ట్ర కో కన్వీనర్ ఎస్.పుష్పలత, టీటీఎన్జీవోఏ హైదరాబాద్ జిల్లా కార్యదర్శులు ప్రశాంత్ కుమార్, ఉపాధ్యక్షులు ముత్యాలరావు, ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ట్రెజరీ ఫోరమ్ కార్యవర్గ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.