రిపోర్టర్ కె.సత్యనారాయణ పై దాడి చేసి హత్య చేసిన దుండగులను కఠినంగా శిక్షించాలి

రిపోర్టర్ కె.సత్యనారాయణ పై దాడి చేసి హత్య చేసిన దుండగులను కఠినంగా శిక్షించాలని జిల్లా దాడుల నిరోధక కమిటీ మెంబర్ టి. కెవిశ్వనాథ్ డిమాండ్ చేశారు. ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. యూనియన్ లో ఆయన క్రియాశీలకంగా వ్యవహరించి జర్నలిస్ట్ సంక్షేమానికి కృషి చేసారని గుర్తు చేశారు.