వైకాపా ఎమ్మెల్యే దాడిశెట్టి రాజాపై కేసు నమోదు

వైకాపా ఎమ్మెల్యే దాడిశెట్టి రాజాపై కేసు నమోదు తూర్పు గోదావరి జిల్లా తుని ఎమ్మెల్యే, వైకాపా నేత దాడిశెట్టి రాజాపై కేసు నమోదైంది. తునిలో విలేకరి సత్యనారాయణ హత్యకు గురైన విషయం తెలిసిందే. ఆ హత్యకు సంబంధించి ఎమ్మెల్యే దాడిశెట్టి రాజాపై విలేకరి సత్యనారాయణ కుటుంబసభ్యులు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు ఎమ్మెల్యే రాజాతో పాటు మరో ఐదుగురిపై కేసు నమోదు చేశారు.