మహాత్మాగాంధీ 150వ జయంతి వేడుకలు

రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో మహాత్మాగాంధీ 150వ జయంతి వేడుకలను తెలంగాణ ప్రభుత్వం ఘనంగా నిర్వహించింది. లంగర్‌హౌస్‌లోని బాపూఘాట్ వద్ద మహాత్మునికి గవర్నర్ తమిళిసై సౌందరరాజన్, ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రులు , ప్రజాప్రతినిధులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం సర్వమత ప్రార్థనంలో గవర్నర్, సీఎం పాల్గొన్నారు.