కాంట్రాక్టు ఔట్‌సోర్సింగ్‌ నియామకాలపై కమిటీ

కాంట్రాక్టు ఔట్‌సోర్సింగ్‌ నియామకాలపై కమిటీ


రాష్ట్రంలో కాంట్రాక్టు ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగాల నియామకాలకు సంబంధించి మార్గదర్శకాల రూపకల్పనకు ప్రభుత్వం ఐదుగురు సభ్యులతో కమిటీని నియమించింది. ఈ మేరకు శుక్రవారం ఉత్తర్వులు జారీచేసింది. సాధారణ పరిపాలనశాఖ కార్యదర్శి దీనికి ఛైర్మన్‌గా ఉంటారు. కమిటీలో ఆర్థిక, న్యాయశాఖల కార్యదర్శులు, కార్మికశాఖ కమిషనర్‌, సాధారణ పరిపాలనశాఖ అదనపు కార్యదర్శి సభ్యులుగా ఉంటారు. కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్‌ నియామకాలతోపాటు ఏజెన్సీల ఎంపిక, వివిధ శాఖల అవసరాలు తదితర అంశాలపై ఈ కమిటీ నివేదిక ఇస్తుంది. మూడువారాల్లో కమిటీ నివేదిక అందజేయాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.