రాష్ట్రంలో ఇసుక దొంగలు పడ్డారు..!

రాష్ట్రంలో ఇసుక దొంగలు పడ్డారు..!
* భవన నిర్మాణ కార్మికుల కడుపు మండుతోంది
* బంగారం దొరుకుతున్నా.. ఇసుక దొరకడం లేదు
* టీడీపీ ప్రభుత్వంలో ఉచితంగా సరఫరా చేశాం..
* కార్మికుల ఆకలి మంటల్లో జగన్ ప్రభుత్వం కాలిపోక తప్పదు


"ఆంద్రప్రదేశ్ రాష్ట్రంలో ఇసుక దొంగలు పడ్డారు.. భవన నిర్మాణ కార్మికుల కడుపు మండుతోంది.. ఇసుక లేక తాపీ మేస్త్రీ పనులు ఆపేశారు.. కార్మికుల ఆకలి మంటల్లో జగన్ ప్రభుత్వం కాలిపోక తప్పదు.. టీడీపీ హయాంలో ఇసుక ఉచితంగా సరఫరా చేశాం.. చేతకాని ప్రభుత్వం కర్షక కార్మికుల పొట్ట కొడుతోంది" అంటూ టీడీపీ జిల్లా అధ్యక్షులు పులివర్తి నాని గాటుగా విమర్శించారు. 
     తిరుపతి ఆర్డీవో కార్యాలయం వద్ద  రాష్ట్రంలో ఇసుక కొరత సృష్టించిన వైసీపీ ప్రభుత్వంపై నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా నాని మాట్లాడుతూ టీడీపీ ప్రభుత్వంలో ఇసుక ఉచితంగా ఇచ్చినప్పటికీ వైసీపీ ప్రభుత్వం తమ నాయకులు, కార్యకర్తలకు దొడ్డిదారిన సంపాదించి పెట్టెలా పాలసీ అమలు చేస్తున్నారు అని ఆరోపించారు. ఇసుకాసురుల భరతం పట్టాల్సిన అధికారులు దగ్గరుండి మరీ అక్రమ ఇసుక రవాణాలను ప్రోత్సహిస్తున్నారు అన్నారు. ప్రభుత్వం తక్షణమే ఇసుక కొరత లేకుండా చేసి అందరికీ అందు బాటులోకి తెచ్చేలా చూడాలని డిమాండ్ చేశారు.


Popular posts
రాష్ట్ర తొలి మహిళా సీజేజస్టిస్‌ హిమ ప్రమాణం
Image
జాతీయ అర్హత ప్రవేశ పరీక్ష (నీట్‌) వాయిదా.
*లాక్ డౌన్ నిబంధనలకు విరుద్ధంగా శ్రీ బాలాజీ వైన్స్ లో మద్యం వ్యాపారం* *మేడ్చల్ జిల్లా జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని శ్రీ బాలాజీ వైన్స్ లో లాక్ డాన్ నిబంధనలను తుంగలో తొక్కిన యాజమాన్యం.* *భౌతిక దూరం పాటించకుండా విచ్చలవిడిగా చేస్తున్న మద్యం వ్యాపారం.* *కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కరోనా మహమ్మారిని కట్టడి చేయడానికి భౌతిక దూరం తప్పనిసరని నెత్తి నోరు మొత్తుకుని చెప్తున్నా సదరు వైన్స్ యజమానులు లాక్‌డౌన్‌ నిబంధనలకు తూట్లు పొడుస్తున్నారు. దీనిపై పోలీసు మరియు ఎక్సైజ్ శాఖ ఉన్నతాధికారులు తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుకుమతున్నారు.
Image
పేకాట శిబిరంపై స్పెషల్ ఎన్ఫోర్స్‌మెంట్ అధికారులు దాడి
డంపింగ్ యార్డ్‌ను తరలించాలంటూ స్థానికులు ఆందోళన