ఏజన్సీ ప్రజలకు బస్ సౌకర్యం


ఏజన్సీ ప్రజలకు బస్ సౌకర్యం కల్పించుటకు కృషి చేసిన సీఐ
ఎన్ ఎన్ మూర్తి.రోడ్డు మార్గం పరిశీలించిన ఎస్ఐ ఆర్ శ్రీను


 ఏజెన్సీ గిరిజన గ్రామాల ప్రజలు రోడ్డు కష్టాలు తీరనున్నాయి. పోలీస్ అమరవీరుల వారోత్సవాల సందర్భంగా ప్రభుత్వ జూనియర్ కళాశాలకు విచ్చేసిన పోలవరం సిఐ ఎన్ ఎన్ మూర్తి, ఎస్సై ఆర్ శ్రీను లకు ఏజెన్సీ గ్రామాల నుంచి చదువు కునేందుకు వస్తున్న సుమారు 25 మంది విద్యార్థిని, విద్యార్థులు రోడ్డు మార్గం సరిలేక, బస్సు సౌకర్యం లేక గత మూడు నెలల నుంచి ఎన్నో ఇబ్బందులు పడుతున్నామని సీఐ ఎన్ ఎన్ మూర్తి కి, ఎస్ఐ ఆర్ శ్రీను కు వివరించారు. తక్షణమే  స్పందించిన సీఐ ఎన్ ఎన్ మూర్తి జంగారెడ్డిగూడెం ఆర్ టి సి రీజినల్ మేనేజర్ కు బస్సు సౌకర్యం లేక 19  ఏజెన్సీ గిరిజన గ్రామాల ప్రజలు, స్కూల్ విద్యార్థిని, విద్యార్థులు పడుతున్న అవస్థలు గురించి వివరించి తక్షణమే బస్సు సౌకర్యం కల్పించాలని సీఐ ఎన్ ఎన్ మూర్తి కోరారు. సానుకూలంగా స్పందించిన జంగారెడ్డిగూడెం ఆర్టీసీ రీజినల్ మేనేజర్ డిపో డ్రైవర్ కు పోలవరం టూ కొరుటూరు రోడ్డు మార్గం ను పరిశీలించమని ఆదేశించారు. పోలవరం ఎస్ ఐ ఆర్ శ్రీను ఆర్టీసీ డ్రైవర్ ప్రసాద్  ను తమ వెహికల్ పై తీసుకెళ్లి రోడ్డు మార్గం , ప్రాజెక్ట్ ప్రాంతం వద్ద, కొత్తూరు కాజ్వే వద్ద గతంలో సీఐ మూర్తి, ఎస్సై శ్రీను, పోలవరం పోలీస్ సిబ్బంది, స్థానిక వైయస్సార్ పార్టీ నాయకులు, కార్యకర్తలు స్థానిక వాహనాలు ట్రాక్టర్లు, లారీలో సహాయంతో మట్టి, రాయి,సోట్రు తెప్పించి రోడ్డు మార్గము సరిచేసి ఏజెన్సీ ప్రజలకు రవాణా సౌకర్యానికి ఏ విధమైన ఇబ్బంది లేకుండా సరి చేసామని ఆర్టీసీ బస్సు ప్రయాణించు టకు అనుకూలంగానే ఉందని ఆయా ప్రదేశాలను ఆర్టీసీ డ్రైవర్ కు పోలవరం ఎస్ ఐ ఆర్ శ్రీను చూపించారు. రోడ్డు మార్గం పరిశీలించిన డ్రైవర్ ఒకటి రెండు చోట్ల వర్షం కురిస్తే ఇబ్బంది కలిగించవచ్చని లేకుంటే ఏ విధమైన ఇబ్బంది లేదని తెలిపారు. జంగారెడ్డిగూడెం ఆర్టీసీ రీజినల్ మేనేజర్ ఆదేశాల మేరకు సోమవారం నుండి ఏజెన్సీ గ్రామాలకు బస్సు సౌకర్యం  అందుబాటులో ఉంటుందని  పోలవరం ఎస్ఐ ఆర్ శ్రీను తెలిపారు. జంగారెడ్డిగూడెం ఆర్టీసీ బస్సు ఏజెన్సీ గ్రామాలకు వెళ్లి వచ్చిన అనంతరం పరిస్థితిని సమీక్షించి నిడదవోలు డిపో బస్సు సేవలను కూడా ఏజెన్సీ గిరిజన గ్రామాల ప్రజలకు అందుబాటులోకి వస్తాయన్నారు.


Popular posts
తెలుగు జనతాపార్టీ సేన నియామకం
Image
*లాక్ డౌన్ నిబంధనలకు విరుద్ధంగా శ్రీ బాలాజీ వైన్స్ లో మద్యం వ్యాపారం* *మేడ్చల్ జిల్లా జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని శ్రీ బాలాజీ వైన్స్ లో లాక్ డాన్ నిబంధనలను తుంగలో తొక్కిన యాజమాన్యం.* *భౌతిక దూరం పాటించకుండా విచ్చలవిడిగా చేస్తున్న మద్యం వ్యాపారం.* *కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కరోనా మహమ్మారిని కట్టడి చేయడానికి భౌతిక దూరం తప్పనిసరని నెత్తి నోరు మొత్తుకుని చెప్తున్నా సదరు వైన్స్ యజమానులు లాక్‌డౌన్‌ నిబంధనలకు తూట్లు పొడుస్తున్నారు. దీనిపై పోలీసు మరియు ఎక్సైజ్ శాఖ ఉన్నతాధికారులు తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుకుమతున్నారు.
Image
లాక్ డౌన్ కారణంగా పనుల్లేక చేతిలో చిల్లిగవ్వ లేని పరిస్థితుల్లో
చీకట్లో బావిలోకి దూకి శవాన్ని వెలికితీసిన సిఐ
6వ తేదీ టీడీపీ కార్యాలయం ప్రారంభం